Journalist molested at ITO Metro station in Delhi ఢిల్లీ మెట్రో స్టేషన్లో యువతి, జర్నలిస్టుపై వేధింపులు

Brave woman journalist fights back molester at delhi metro station

Delhi, Delhi metro, Molestation, Groping, CISF, Delhi police, ITO station, ITO metro station, Delhi Metro, DMRC, molestation, woman molested, ITO

Delhi Police arrested a man who allegedly molested two women on the same day at the ITO metro station. Authorities say a shortage of staff is making women vulnerable in metro station corridors.

ITEMVIDEOS: ఢిల్లీ మెట్రో స్టేషన్లో యువతి, జర్నలిస్టుపై వేధింపులు

Posted: 11/17/2017 03:14 PM IST
Brave woman journalist fights back molester at delhi metro station

దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. ఢిల్లీ వీదుల్లో నిర్లజ్జంగా కామదాహంతో మగమృగాలు సంచరిస్తూనే వున్నాయి. ఎక్కడ అదును దొరికిా.. అడపిల్లలు కనబడినా వారిపై తెగబడుతున్నాయి. దేశంలోనే అత్యంత పవిత్రమైన, పెద్దదైన చట్టసభకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ యువతితో పాటు మహిళా జర్నలిస్టుకు కూడా మెట్రో స్టేషన్ లో లైంగిక వేదింపులకు తెగబడ్డాడు.

తొలుగు యువతిపై కామవాంఛతో తెగబడేందుకు సిద్దమైన పైశాచిక మృగం.. ఆ తరువాత మహిళా జర్నలిస్టుపైనే అదే విధంగా తెగబడ్డాడు. వారిపై విరుచుకుపడేందుకు  విఫలయత్నం చేశాడు. అయితే ఆ మహిళలు ప్రతిఘటించడంతో అతను కాళ్లకు బుద్ధి చెప్పాడు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐటీవో మెట్రో స్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీలో రికార్డయింది.
 
నిందితుడు తాగినమైకంలో మహిళలపై వేధింపులకు పాల్పడినట్టు పోలీసు విచారణలో తేలింది. అతన్ని అఖిలేష్ కుమార్‌గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో మహిళలిద్దరూ ధైర్యంగా అతన్ని ఎదుర్కొన్నట్టు, దీంతో అతను తోకముడిచినట్టు రికార్డయింది. కాగా, మంగళవారం, బుధవారం దాదాపు 5 వేల మంది వ్యక్తులను ఇంటరాగేట్ చేసిన అఖిలేష్ కుమార్‌ జాడ తెలుసుకున్నట్టు డీసీపీ పంకజ్ సింగ్ తెలిపారు. కుమార్ ఓ టీస్టాల్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Delhi metro  Molestation  Groping  CISF  Delhi police  Crime  

Other Articles