Man Dies After Sleeping With Fan ఫ్యాను గాలి యువకుడి ఉసురు తీసింది..

Are you sleeping with fans poimting at you then be careful

thailand, man dies of fan, lifeless man, Sobthawee Boonkua, Tambon Nai Muang, Chaiyaphum province, hypothermia

A man in Thailand decided to sleep with three electric fans pointed at him but ended up sleeping permanently in the process as his body laid lifeless the following day.

ఫ్యాను గాలి పడుకుంటున్నారా..? అయితే జాగ్రత్తా..!

Posted: 11/14/2017 07:07 PM IST
Are you sleeping with fans poimting at you then be careful

నిద్రలోకి జారుకుంటున్నారా.. నిద్ర పట్టడం లేదని మీరు ఫ్యాన్ వేసుకోలేదు కదా..? వేసుకుంటే జాగ్రత్తా సుమా..? ప్యాను గాలి కూడా మనిషి ఉసురు తీస్తుందని తాజాగా నమోదైంది. ఈ మేరకు ఓ విషాద ఘటన థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది. ఉక్కపోతను భరించలేని ఓ వ్యక్తి ఫ్యాన్లు పెట్టుకుంటే ఆ గాలి అతడి ప్రాణాలు తీసింది. నమ్మశక్యంగా లేదా..? కానీ ఇది ముమ్మలాటికీ నిజం..  వివరాల్లోకి వెళితే.. థాయ్ లాండ్ లోని చయాఫూమ్ ప్రావిన్స్ కు చెందిన సోబ్తావీ (44) తన తల్లిని చూసేందుకు తాంబాన్ ముయాంగ్ వచ్చాడు.

అయితే చీకటి పడుతున్నా ఉక్కపోత మాత్రం తగ్గకపోవడంతో దానిని నుంచి తప్పించుకునేందుకు ఏకంగా మూడు ఫ్యాన్ ఏర్పాటు చేసుకుని అన్ని తనపైవు గాలి విసేలా చూసుకుని నిద్రకు ఉపక్రమించాడు. అంతేకాదు.. ఇలా నిద్రలోకి జారుకునే క్రమంలో ఉక్కపోత అధికంగా వుందని మంచంపై కాకుండా నేలపైనే పడుకున్నారు. అక్కడే అసలు సమస్య వచ్చింది. ఈ ప్రాంతంలో రాత్రైన తరువాత క్రమంగా ఉష్ణగ్రతల్లో మార్పులు తారుమారు అవుతాయి.. ఉదయం ఉక్కపోత కాస్తా రాత్రికి చలిగాలులుగా మారిపోతుంది.

ఈ విషయాన్ని తెలియక నేలపై మూడు ఫ్యాన్లు ఏర్పాటు చేసుకుని పడుకున్న సోబ్తావీ.. రాత్రి వీచిన చలిగాలులకు ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి చల్లగాలులకు తోడు ఆయన ఏర్పాటు చేసుకున్న మూడు ఫ్యాన్ల నుంచి గాలి తధేకంగా వచ్చి ఆయన శరీరాన్ని చల్లబర్చింది. దీనికి తోడు ఆయన నేలపై పడుకోవడం కూడా తీవ్ర ప్రభావం చూపింది.మర్నాడు అతడిని నిద్రలేపేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులు శరీరం చల్లగా ఉండడాన్నిచూసి కీడు శంకించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. హైపోథెర్మియా (శరీరం చల్లబడిపోవడం) కారణంగానే అతడు ప్రాణాలు విడిచాడని వైద్యులు నిర్ధారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles