Airtel comes with yearly recharge plan వార్షిక వ్యాలిడిటీతో ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్..

Airtel recharge plan for rs 3999 offers 300gb data unlimited calling

airtel recharge, airtel 300gb prepaid, airtel offer, airtel plans, airtel unlimited calling plans, airtel recharge plans, airtel data plans

Airtel is taking on Reliance Jio with a new prepaid plan offering 300GB data. Now, the prepaid plan actually costs Rs 3,999, but it has a validity of 360 days in total.

వార్షిక వ్యాలిడిటీతో ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్..

Posted: 11/14/2017 03:59 PM IST
Airtel recharge plan for rs 3999 offers 300gb data unlimited calling

టెలికం రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పుల నేపథ్యంలో ఇటు టెలికాం సంస్థల మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొంది. దీనికి తోడు కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో.. ఉచిత ఆపర్లతో కస్టమర్లను అకర్షించి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడంతో సంస్థల తీవ్రపోటీని ఎదుర్కొని నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లను జారవిడుచుకోవడం ఇష్టంలేని సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త అఫర్లతో తమ వినియోగదారులను అకర్షిస్తున్నాయి.

ఈ క్రమంలో రిలయన్స్ జియోను కట్టడి చేసే విధంగా సమరానికి సై అంటున్న భారతీ ఎయిర్‌టెల్ మరో సూపర్ ఆఫర్ ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం ఇక ఏకంగా ఏడాది కాలం పాటు రీచార్జ్ చేయించుకునే అవసరం లేకుండా ప్లాన్ చేసింది. ఏడాది కాల పరిమితితో రూ.3,999కే 300 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. అలాగే నేషనల్ రోమింగ్ ఉచితమని భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది.

ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్ లు ఇవే..
 
రూ.3,999 ప్యాక్
ఎయర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ప్యాక్‌ కింద అపరిమితంగా లోకల్/ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. వాణిజ్య పరమైన కాల్స్ కూడా చేసుకోవచ్చు. 360 రోజులపాటు 300 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు.
 
రూ.1,999 రీచార్జ్ ప్యాక్
ఈ ప్యాక్ కాల పరిమితి 180 రోజులు. 125 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అపరిమిత కాలింగ్, నేషనల్ రోమింగ్ ఉచితం.
 
రూ.999 ప్యాక్
ఈ ప్యాక్ కాలవ్యవధి 90 రోజులు. 60 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత లోకల్ /ఎస్టీడీ కాల్స్, వాణిజ్యపరంగానూ వాడుకునే వెసులుబాటు, నేషనల్ రోమింగ్ ఉచితం, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Janasena request to fans and party workers

  జనసేన కీలక ప్రకటన

  Jan 19 | త‌మ కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు సంయమ‌నం పాటించాలని సూచిస్తూ జ‌న‌సేన పార్టీ ఈ రోజు ప్రెస్ నోట్ విడుద‌ల చేసింది. 'జ‌న‌సేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండ‌ని ప‌సి ప్రాయం. ఇటువంటి ప‌సి... Read more

 • Chandrababu approaching court shameful

  ITEMVIDEOS: స్పెషల్ స్టేటస్.. బాబు అస్సలు ప్రయత్నించటం లేదా?

  Jan 19 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకుంటే కోర్టుకు వెళతామని చంద్రబాబు అంటున్నారని... ఇది... Read more

 • Mahesh kathi attacked by youth

  ITEMVIDEOS: మహేష్ కత్తిపై దాడి చేసింది మేమే!

  Jan 19 | సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై కోడిగుడ్ల దాడి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మహేష్ పై దాడి చేసింది తామేనంటూ ఇద్దరు యువకులు మీడియా ముందుకు వచ్చారు. ప్రతీ చిన్న విషయానికి మహేష్ కులం... Read more

 • Mahesh kathi egg attack real pawan kalyan fans have questions

  గురువింద కత్తి మహేషా.. గుర్తింపుకేనా ‘గుడ్ల’ వెంపర్లాట..

  Jan 19 | గురువింద గింజ లాంటి వాళ్లు సమాజంలో పరపతి కోసం వెంపర్లాడటం సహజం. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి గురవిందలు ఏకంగా అకాశంపైనే ఉమ్మి వేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అకాశంపై ఉమ్మివేస్తే ఏం... Read more

 • Anchor pradeep license cancelled

  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. యాంకర్ ప్రదీప్ లైసెన్స్ రద్దు

  Jan 19 | డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. జైలు శిక్ష విధించని కోర్టు.. డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్లపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉత్తర్వులు జారీ... Read more

Today on Telugu Wishesh