akbar runs driverless for 2kms and derails నటన ఒంటబట్టి.. ఫిల్మీస్టంట్.. డ్రైవర్ లేకుండా వెళ్లిన అక్బర్..

Akbar does filmy stunt runs driverless for 2kms and derails

Akbar, heritage steam engine, unstoppable, Bollywood movies, heritage train, Rewari, Haryana, bollywood

A heritage steam engine named ‘Akbar’, which has featured in over two dozen Bollywood and other movies, was damaged in a derailment after it ran without a pilot in Haryana’s Rewari

నటన ఒంటబట్టి.. ఫిల్మీస్టంట్.. డ్రైవర్ లేకుండా వెళ్లిన అక్బర్..

Posted: 11/13/2017 07:52 PM IST
Akbar does filmy stunt runs driverless for 2kms and derails

ఒకటి రెండు కాదు ఏకంగా ఇరవైకి పైగా చిత్రాల్లో నటించి, నటించి నటన పూర్తిగా ఒంటబట్టేసింది అనుకుని సినిమా తరహాలో ఓ స్టంట్ చేయబోయి.. నడ్డి విరిగి మూలకు పడింది. అదేంటి.. ఇలా అంటున్నారు అన్న అనుమానాలు కలుగుతున్నాయా..? మేము చెప్పేది ఏ నటి, నటుడిని ఉద్దేశించో కాదు.. మరెవరి గురించి ఏ పశుపక్షాది గురించో అంటున్నారా.. అదీ కాదు.. ఓ పురాతన రైలు గురించి. భారతీయ రైలుకు అద్దం పట్టేలా వారసత్వ సంపదగా నిలిచే రైలు అది. దాని పేరు అక్బర్.

సుమారుగా 20కి పైగా సినిమాల్లో దీనిని వినియోగించారు. ఈ రైలు ఇవాళ డ్రైవర్‌ లేకుండా ఏకంగా రెండు కిలోమీటర్ల మేర ప్రయాణించి పట్టాలు తప్పింది. హరియాణాలోని రెవారిలో ఈ ఘటన జరిగింది. అయితే అప్పటికే రైలు బ్రేకులు ఫెయిలయ్యాయని ఆ రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్లలిద్దరూ రైలు నుంచి దూకేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సుల్తాన్‌, బాగ్‌ మిల్కా బాగ్‌, రంగ్‌ దే బసంతి వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ రైలు ఇవాళ ప్రమాదానికి గురైంది.

ఉన్నతాధికారుల సందర్శనార్థం అక్బర్ ను బయటకు తీశారు. ఈ క్రమంలో డ్రైవర్ ఇంజిన్ ను స్టార్ట్ చేశాడు. బ్రేక్ లెవర్స్ జామ్ అయ్యాయని గుర్తించిన డ్రైవర్ వెంటనే మరో డ్రైవర్ తో కలిసి ఇంజిన్ నుంచి దూకేశాడు. రెండు కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మొఘల్ రాజు అక్బర్ పేరు మీదుగా ఈ స్టీమ్‌ ఇంజిన్ కు పెట్టారు. భారత రైల్వేల్లో పురాతన స్టీమ్ రైలింజన్లలో ఒకటైన అక్బర్ ను చిత్తరంజన్ లోకోమెటీవ్ వర్క్స్ తయారుచేయగా.. 1965 నుంచి సేవల్ని అందిస్తోంది. దూకేశాడు. పట్టాలు తప్పడంతో బాగా దెబ్బతిందని, మరమ్మతులకు బాగా ఖర్చు అవుతుందని అధికారులు వాపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akbar  heritage steam engine  unstoppable  Bollywood movies  heritage train  Rewari  Haryana  bollywood  

Other Articles