minister ktr says metro is ready to take off మెట్రో ప్రారంభానికి ప్రభుత్వం సిద్దం.. ప్రధానిదే అలస్యం..

Minister ktr says metro is ready to take off with 57 trains

metro rail, 57 metro trains, telangana IT minister KTR, Telangana Assembly, PM modi, Inauguration, November 28, muyapur to nagole, metro stationsm hyderabad metro time table, hyderabad metro rail tickets, hyderabad metro rail tokens, hyderabad metro rail tickets

Telangana IT minister KT rama rao says that the government is ready to start the metro services in city, but the delay is only from PM as he has to come and inaugurate the prestigious project.

మెట్రో ప్రారంభానికి ప్రభుత్వం సిద్దం.. ప్రధానిదే అలస్యం..

Posted: 11/13/2017 12:33 PM IST
Minister ktr says metro is ready to take off with 57 trains

హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా వుందని, అయితే ఈ ప్రాజెక్టు దేశ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు తాము సన్నహాలు చేస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు అధికారికంగా సమాచారం ఇంకా వెలువడలేదని దానికోసమే తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. అన్ని అనుకూలిస్తే ఈ నెల 28న ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాము అన్ని విధాల సిద్దంగా వున్నామన్నారు.

తొలిదశలోనే ఏకంగా 30 కిలోమీట‌ర్లు మేర మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్రారు. అసెంబ్లీలో మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రసంగంలో భాగంగా ఈ వ్యాఖ్యలుచేశారు. మియాపూర్ నుంచి నాగోల్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కాగా విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ప్రాజెక్టు నిర్మాణంలో అసాధారణ జాప్యం ఎన్నడూ జరగలేదన్నారు. తొలిదశ తరువాత ఫేజ్ 2కి కూడా త్వరలోనే తుదిరూపు ఇస్తామన్నారు. పాతబస్తీపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు. మెట్రో నిర్మాణంలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా జాప్యం జరుగుతుందన్నారు.

ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిఫ్ (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పుకోచ్చిన కేటీఆర్.. ఈ ప్రాజెక్టు కోసం త‌మ స‌ర్కారు రూ.3 వేల కోట్లు కేటాయించగా, ఇప్పటివ‌ర‌కు 2,240 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. కాగా కేంద్రం రూ. 1,458 కోట్లు సమకూరుస్తుందని అయితే ఇప్పటివరకు రూ. 958 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుంద‌ని తెలిపారు. దేశ చరిత్రలో 30 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రారంభించడం కూడా ఇదే తొలిసారని కేటీఆర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles