traffic police to plan fine on all the three in triple riding యువత తెలుసుకో: ట్రిపుల్ రైడింగ్ పై నిబంధనలు కఠినం

Traffic police to plan fine on all the three in triple riding

two wheelers, bikes, triple riding, traffic police, traffic rules, youth, road accidents, hyderabad, cyberabad, rachakonda commissionerates, telangana government

telangana traffic police has prepared a report on road accidents, mainly the two wheeler accidents where the youth repeatedly held in triple riding.

యువత తెలుసుకో: ట్రిపుల్ రైడింగ్ పై నిబంధనలు కఠినం

Posted: 11/13/2017 11:55 AM IST
Traffic police to plan fine on all the three in triple riding

హైదరాబాద్ మహానగరంలో జరగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్నందువల్లే యువత ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలుసుకున్న పోలీసు యంత్రాంగం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టూవీలర్స్ పై ట్రిపుల్ రైడింగ్ చేసే యువతను కట్టడి చేయాలని భావిస్తుంది. ఇకపై ద్విచక్రవాహనాలపై ట్రిఫుల్ రైడింగ్ చేసే ముగ్గరికి జరిమానా వేయాలని యోచిస్తుంది.

సాధారణంగా ఇప్పటివరకు కేవలం వాహనం నడిపే వ్యక్తిపై మాత్రమే కేసులు వేసి జరిమానా కట్టించుకునేవారు. అయితే ఈ నిబంధనను కాసింత కఠినతరం చేయాలని ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. దీంతో ప్రమాదాలకు అడ్డకట్ట వేయవచ్చని వారు భావిస్తున్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న ఇద్దరిపైనా కేసులు నమోదు చేయాలని.. ముగ్గురిపైనా జరిమానా విధించాలని అధికారులు యోచిస్తున్నారని సమాచారం.
 
హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదైన ట్రిపుల్‌ రైడింగ్‌ కేసుల వివరాలతో ఒక నివేదికను రూపొందించి ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు.. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ట్రిపుల్‌ రైడింగ్‌ వల్ల కలిగే అనర్థాలు, పరిణామాల గురించి సమగ్రంగా ఆ నివేదికలో పేర్కొననున్నారు. తమ నివేదికలో నగరశివార్ల పరిధిలోనే యువత అధికంగా ట్రిఫుల్ రైడింగ్ చేస్తుందని కూడా గుర్తంచారు.

రాచకోండ కమీషనరేట్ పరిధిలో కేవలం 5 నెలల్లోనే 10 వేల ట్రిపుల్‌ రైడింగ్‌ కేసులు నమోదు చేసి.. రూ. 10లక్షల మేర జరిమానాలు విధించారంటే పరిస్థిని అర్థం చేసుకోవచ్చు. దీంతోనే చట్టాన్ని కఠినతరం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయనున్నారి అధికారులు. ఇకపై ట్రిపుల్ రైడింగ్ కేసులో వాహనచోదకుడితో పాటుపాటు వెనుక కూర్చున్న ఇద్దరిపైనా కేసులు నమోదు చేయాలని ప్రతిపాదనలు పంపుతున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Multiplexes theaters to allow outside food in telangana

  సర్కార్ సంచలన నిర్ణయం.. మల్టీప్లెక్సులో బయటి అహారం..

  Jul 19 | తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయాలు పడిన నేపథ్యంలో ఎవరైనా తమ ప్రభుత్వంపై కూడా న్యాయస్థానాన్ని అశ్రయిస్తే.. అక్కడి వెళ్లిన తరువాత పరిస్థితిని చూసుకుందామన్న భావనను రానీయకుండా.. ముందుగానే అలర్గ్ అయ్యింది.... Read more

 • Lok sabha passes bill to scrap no detention policy in schools

  విద్యార్థులూ.. జాగ్రత్తా.! మళ్లీ ఫెయిల్ విధానం అమల్లోకి..

  Jul 19 | భారత దేశంలో అన్ని రంగాల్లో తమ ఉనికి వుండేలా చర్యలు తీసుకుంటున్న కేంద్రంలోని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం.. స్వాతంత్ర్యం ఏర్పడిన నాటి నుంచి కొనసాగుతున్న కరెన్సీ నోట్లను కూడా మార్చి.. ఇక కరెన్సీ వాడిన... Read more

 • Jet airways offers up to 30 discount on domestic international flight tickets in new sale

  జెట్ ఎయిర్ వేస్ విమాన టికెట్లపై భారీ రాయితీ

  Jul 19 | చౌకధర విమానయానం కల్పించే సంస్థ జెట్ ఎయిర్ వేస్ తాజాగా విమాన ప్రయాణికులకు మంచి ఆఫర్ ప్రకటించింది. తమ విమానాల్లో ప్రయాణించనున్న కస్టమర్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా రాయితీని ప్రకటించింది. జెట్ ఎయిర్ వేస్ దేశీయ,... Read more

 • Congress to attack center raise issues that are difficult to counter during no confidence motion

  మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై దిక్కులు పిక్కటిల్లాలి: సోనియా

  Jul 19 | కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాసంపై శుక్రవారం లోక్ సభలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టడానికి తమకు తగిన సంఖ్యాబలం... Read more

 • Ys jagan draws huge crowds in kakinada

  జగన్ సభకు అసంఖ్యాక జనం.. కాకినాడ అదుర్స్..

  Jul 19 | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర 200 రోజులకు పైగా కొనసాగిస్తున్న అత్యంత ప్రజాదరణను కూడా కూడగట్టుకుంటుంది. ఈ క్రమంలో క్రితం రోజున... Read more

Today on Telugu Wishesh