AirAsia India big sale on huge discount ఎయిర్ఏషియా అఫర్: రూ.99 దేశీయం.. రూ.444లకే విదేశీయానం

Airline offers rs 99 base fare for domestic travel rs 444 for international

AirAsia, AirAsia cheap fares, AirAsia discount sale, AirAsia India offer, AirAsia MD Amar Abrol, AirAsia Rs 99 base fare, AirAsia Rs 444 base fare international journey, malaysian budget carrier AirAsia, Indian JV airline

The Malaysian budget carrier AirAsia announced a discount sale, offering passengers one-way base fare at Rs 99 for a domestic journey across its Indian JV airline network and Rs 444 for international flights under a limited period offer.

ఎయిర్ఏషియా అఫర్: రూ.99 దేశీయం.. రూ.444లకే విదేశీయానం

Posted: 11/13/2017 10:56 AM IST
Airline offers rs 99 base fare for domestic travel rs 444 for international

మలేషియాకు చెందిన బడ్జెట్‌ విమానయాన సంస్థ ‘ఎయిర్‌ఏషియా ఇండియా’ ఇటీవల ఇండిగో బాటలోనే పయనిస్తూ.. ఓ మహిళా ప్రయాణికురాలితో అసభ్యకరంగా, దురుసుగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి రావడంతో.. దానిని రూపుమాకునే చర్యలకు ఎయిర్ లైన్స్ సంస్థ ప్రయత్నాలు చేపట్టినట్లు సమాచారం. ఇందులోభాగంగానే తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే కస్టమర్లకు బంపర్‌ డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటించింది.

ఈ ఆపర్ ప్రకారం వచ్చే ఏడాది మే నుంచి జనవరి, 2019 మధ్య కాలంలో దేశ, విదేశాల్లోని పలు నగరాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు కేవలం బేసిక్ దరల ప్రకారం టికెట్లను అపర్ చేయనుంది. ఎయిర్ ఏషియా సంస్థ విమానాల్లో ఈ ఆఫర్‌ కింద దేశీయ పర్యటనలకు రూ.99, విదేశీ పర్యటనలకు రూ.444 కనీస ధర (బేస్‌ ఫేర్‌)తో వన్‌వే టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అయితే ఈ ధరలతో పాటు ఫ్యూయల్‌ సర్ చార్జి, ఎయిర్ పోర్టు ఫీజు, ఇతర పన్నులు కస్టమర్లు అదనంగా చెల్లించుకోవాల్సి వుంటుంది.

ఎయిర్ లైన్‌ వెబ్ సైట్‌ లేదా యాప్‌ ద్వారా మాత్రమే కస్టమర్లు ఈ డిస్కౌంట్ టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలని సంస్థవర్గాలు సూచించాయి. క్రితం రోజు రాత్రి 9.30 గంటల నుంచి ఈ నెల 19 వరకు ఈ టిక్కెట్లు అందుబాటులో వుండనున్నాయి. ‘దీని వల్ల హాలీడే ప్రయాణీకులు తమ ప్రయాణాల్ని మరింత బాగా ప్లాన్ చేసుకోగలుగుతారు’ అని ఎయిర్ ఏషియా ఇండి యా ఎండి, సిఇఒ అమర్‌ అబ్రోల్‌ చెప్పారు. ఇందకు తమ ఇండియా భాగస్వామి టాటాసన్స్ కూడా ప్రయాణికులకు తమ సహకారాలను అందిస్తారని అశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో ఎయిర్ ఏషియా ఇండియా విమానాలు నడిచే బెంగుళూరు, కోచి, హైదరాబాద్‌, రాంచీ, భువనేశ్వర్‌, కోల్ కతా, న్యూఢిల్లీ, గోవాలకు రూ.99 బేస్ ఫేర్ తో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తిరుచిరాపల్లి, కోచి, భువనేశ్వర్‌, ఢిల్లీ, జైపూర్‌ నుంచి కౌలాలంపూర్‌ వెళ్లే ఎయిర్‌ఏషియా విమానాలు, ముంబై, కోల్‌కతా నుంచి బాలి వెళ్లే విమానాలు, జైపూర్‌, కోల్‌కతా, కోచి, చెన్నై, బెంగుళూరు నుంచి బ్యాంకాక్‌ వెళ్లే ఎయిర్‌ఏషియా విమానాల్లో రూ.444 బేస్‌ ఫేర్‌తో టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  discount offer  cheap fares  domestic offers  international offers  budget carrier  

Other Articles

 • Cabinet ministers should speak up like sc judges yashwant sinha

  వారికున్న అందోళన మీలోనూ వుంటే గొంతు విప్పండీ..!

  Jan 13 | కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మరోమారు బీజేపి సీనియర్ నేత, మాజీ అర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా పరోక్ష విమర్శలు ఎక్కుపెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు న్యాయమూర్తులను అదర్శంగా తీసుకుని కేంద్రంలోని క్యాబినెట్ మంత్రులు... Read more

 • Hyderabad police burst hitech prostitution racket

  హెటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు..

  Jan 13 | పండుగ వేళ ఎవరికి వారు సంబరాల్లో మునిగి తేలేందుకు సిద్దమవుతున్న క్రమంలో.. సందేట్లో సడేమియాలు మాత్రం తమ వ్యాపారాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ దాడులు... Read more

 • Court sentences two years jail term for mlc srinivas reddy

  ఎమ్మెల్సీకి రెండేళ్ల జైలు.. జరిమానా..

  Jan 13 | అధికారంలో వున్నవారైనా, విపక్షంలో వున్నవారైనా కేసులు పెట్టిన తరువాత మాత్రం చట్టం చట్రం నుంచి తప్పించుకోలేరు. ఎవరికీ చట్టం చుట్టం కాదు అని మరోమారు రుజువైంది. విధినిర్వహణలో ఉన్న సీఐపై దాడికి పాల్పడిన కేసులో... Read more

 • Hyderabadis went to native police security beeed up

  పల్లెకు నగరవాసి.. ముమ్మరమైన పోలీసు గస్తీ..

  Jan 13 | ఉదయాన్నే బోగి మంటలు, బందువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల పలకరింపులు క్షేమసమాచారాలు ఆ తరువాత అభ్యంగన స్నానాలు.. ఇక ఊరూ వాడా అంత ఒక్క చోట చేరి సరదాగా అటలు అడుకునే సంప్రదాయకర పండుగ రోజును... Read more

 • Trs mla srinivas goud too travels in nayini way

  నాయిని బాటలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్..

  Jan 13 | తెలంగాణ రాకుమునుపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బండబూతులు తిట్టినోళ్లు.. తెలంగాణ అడ్డుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించోనోళ్లు.. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన తరువాత అదే కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగుతున్నారని, సంచలన వ్యాఖ్యలు చేసిన... Read more

Today on Telugu Wishesh