AP Special Status Fight Back Again | ప్రత్యేక హోదా పోరు ఉధృతం.. పార్టీల భేటీలు దేని కోసం?

Ap special status movement raise again

Andhra Pradesh Special Status, Actor Shivaji Special Status, CPI Ramakrishna Pawan Kalyan, Pawan Kalyan Special Status, Kurnool Rountable Meet Special Status, Rajamaundrhy Special Status Fight, Undavalli Arun Kumar Special Status

Andhra Pradesh Special Status Fight Back Again. Rountable Meet Along with Andhra Medhavulu Sanghma and also All-party Meeting In Rajahmundry For AP Special Status.

మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా పోరాటం

Posted: 11/13/2017 09:35 AM IST
Ap special status movement raise again

ప్రత్యేక హోదా నినాదం మరోసారి ఉద్యమ రూపకంగా మారబోతోంది. ఏపీ ప్రజల హక్కు ప్రత్యేక హోదా అన్న నినాదంతో ఈ నెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు సినీ నటుడు ప్రకటించారు. విభజన సమస్యలు, ప్రత్యేక హోదా అంశంపై కర్నూలులో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ భేటీకి సీపీఐ నేత రామకృష్ణ, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సినీ నటుడు శివాజీ తదితరులు హాజరయ్యారు.

ప్రత్యేక హోదాను సాధించడానికి వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు నడుం బిగించాలని ఈ సందర్భంగా వాళ్లు పిలుపునిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీతో ఇప్పటిదాకా రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని.. హోదాతోనే అన్ని రంగాల్లో రాష్ట్రం ముందడుగు వేస్తుందని వారు చెప్పారు. ఇక రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదానే కీలక అంశంగా మారబోతోందని... ప్రత్యేక ప్యాకేజీ అన్నవాళ్లు భూస్థాపితమవుతారని జోస్యం చెప్పారు.

విభజనతో నష్టపోయిన ఏపీ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు సాగాలంటే ప్రత్యేక హోదా చాలా అవసరమని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.ఇప్పుడు ఉన్న ఎంపీల్లో 72 శాతం మంది వ్యాపారస్తులే ఉన్నారని... పేదల కష్టాలు వీరికెలా తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సాయంత్రం రాజమండ్రిలోనూ సీీపీఐ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరగ్గా.. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

పవన్ వస్తే ఊపు రావటం ఖాయం.. రామకృష్ణ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. తాము చేపడుతున్న 'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి పవన్ కూడా కలిసి రావాలని కోరారు. పవన్ కూడా ఇందులో భాగస్వామి అయితే... పోరాటానికి ఊపు వస్తుందని రామకృష్ణ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Cabinet ministers should speak up like sc judges yashwant sinha

  వారికున్న అందోళన మీలోనూ వుంటే గొంతు విప్పండీ..!

  Jan 13 | కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మరోమారు బీజేపి సీనియర్ నేత, మాజీ అర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా పరోక్ష విమర్శలు ఎక్కుపెట్టారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు న్యాయమూర్తులను అదర్శంగా తీసుకుని కేంద్రంలోని క్యాబినెట్ మంత్రులు... Read more

 • Hyderabad police burst hitech prostitution racket

  హెటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు..

  Jan 13 | పండుగ వేళ ఎవరికి వారు సంబరాల్లో మునిగి తేలేందుకు సిద్దమవుతున్న క్రమంలో.. సందేట్లో సడేమియాలు మాత్రం తమ వ్యాపారాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ దాడులు... Read more

 • Court sentences two years jail term for mlc srinivas reddy

  ఎమ్మెల్సీకి రెండేళ్ల జైలు.. జరిమానా..

  Jan 13 | అధికారంలో వున్నవారైనా, విపక్షంలో వున్నవారైనా కేసులు పెట్టిన తరువాత మాత్రం చట్టం చట్రం నుంచి తప్పించుకోలేరు. ఎవరికీ చట్టం చుట్టం కాదు అని మరోమారు రుజువైంది. విధినిర్వహణలో ఉన్న సీఐపై దాడికి పాల్పడిన కేసులో... Read more

 • Hyderabadis went to native police security beeed up

  పల్లెకు నగరవాసి.. ముమ్మరమైన పోలీసు గస్తీ..

  Jan 13 | ఉదయాన్నే బోగి మంటలు, బందువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల పలకరింపులు క్షేమసమాచారాలు ఆ తరువాత అభ్యంగన స్నానాలు.. ఇక ఊరూ వాడా అంత ఒక్క చోట చేరి సరదాగా అటలు అడుకునే సంప్రదాయకర పండుగ రోజును... Read more

 • Trs mla srinivas goud too travels in nayini way

  నాయిని బాటలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్..

  Jan 13 | తెలంగాణ రాకుమునుపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బండబూతులు తిట్టినోళ్లు.. తెలంగాణ అడ్డుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించోనోళ్లు.. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన తరువాత అదే కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగుతున్నారని, సంచలన వ్యాఖ్యలు చేసిన... Read more

Today on Telugu Wishesh