At least 16 dead as boat capsizes in Krishna river | కృష్ణా నది ఘోర బోటు ప్రమాదం అప్ డేట్స్.. శోక సంద్రలో ఒంగోలు

Krishna river boat capsize incident

Krishna River, Krishna River Boat Capsize, Krishna River Boat Accident Updates, Krishna River Mishap, Krishna River Incident, Krishna River Pavithra Sangamam

At least 16 dead as boat capsizes in Krishna river. Massive rescue operation going on. The Sink 38 Persons along with Staff.

కృష్ణా నది ఘోర ప్రమాదం.. అప్ డేట్స్

Posted: 11/13/2017 08:44 AM IST
Krishna river boat capsize incident

కృష్ణా నది పవిత్ర సంగమం వద్ద ఆదివారం సాయంత్రం ఫెర్రీ ఘాట్ వద్ద బోటు బోల్తా పడిన ఘటనలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరో ఏడుగురు గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు. నేడు మరో రెండు మృతదేహాలు లభ్యం కావటంతో ఆ సంఖ్య 18కి చేరింది. మృతుల్లో 15 మంది ఒంగోలు వాకర్స్ క్లబ్ మెంబర్స్ కాగా, ఒక వ్యక్తి నెల్లూరుకు చెందినట్లుగా అధికారులు నిర్ధారించారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు నిన్న సాయంత్రం నుంచి గాలింపు చేపట్టాయి. కాగా, బోటు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ దారుణం చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు.

ఘటనపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ విచారణకు ఆదేశించారు. ఈ దారుణం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరించారు. కాగా, బోటు యజమాని, సహాయకులు పరారీలో ఉన్నారని వారు తెలిపారు. కాగా, మృతహాలు నేటి ఉదయం ఒంగోలుకు చేరుకోగా.. బంధువుల రోదనతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుల వివరాలు...
1) రాయపాటి సుబ్రహ్మణ్యం (60)
2) పసుపులేటి సీతారామయ్య (64)
3) కె.ఆంజనేయులు (58)
4) కోవూరి లలిత (35)
5) వెంకటేశ్వరరావు (48)
6) రాజేశ్‌ (49)
7) హేమలత (49)
8) దాచర్ల భారతి (60)
9) కోటిరెడ్డి (45)
10) ప్రభాకర్‌రెడ్డి (50)
11) అంజమ్మ (55)
12) వెన్నెల సుజాత (40)
13) గుర్నాధరావు
14) కోవూరి వెంకటేశ్వరరావు(40)
15) సాయిన కోటేశ్వరరావు
16) సాయిన వెంకాయమ్మ తదితరులుగా వాకర్స్ క్లబ్ మెంబర్లు తేల్చారు.

కాగా, గల్లంతైన వారి వివరాలు... 
1) వెన్నెల రమణమ్మ
2) కారుదారు ఉషారాణి
3) గాజర్ల శివన్నారాయణ
4) పోల కోటేశ్వరరావు
5) పోల వెంకాయమ్మ
6) బిందుశ్రీ
7) కూరపాటి నారాయణరాజు... ఉన్నట్టు వారు తెలిపారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు, స్థానిక మత్స్యకారులు కూడా గాలింపు చేపట్టారు.

మృతుల కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టేది లేదని చినరాజప్ప ఈ సందర్భంగా హెచ్చరించారు. సహాయక చర్యలను ముమ్మరం చేశామని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు, అదనపు బలగాలను కూడా పంపామని అన్నారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అన్ని విధాలుగానూ ఆదుకుంటామని, తక్షణం ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టు ఆయన చెప్పారు. మృతిచెందిన వారిలో చంద్రన్న బీమా ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, బీమా లేని వారికి 8 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాగా అందజేయనున్నామని ఆయన తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles