Bikers chase lions, forest officials ordered probe బైకర్ల వేటలో అటవీశాఖ.. నెట్టింట్లో వీడియో వైరల్

Bikers chasing lion lioness in gujarat s gir on video probe ordered

Guj bikers chase lions, gj-03 rajkot, bikers in gir forest, bikers chase lions, gujarat, forest department, social media, viral video, video viral

After a video went viral on social media showing four bikers chasing lions, lionesses and their cubs, with the animals fleeing from fear of the vehicles and their noise, the state forest department has launched an inquiry

ITEMVIDEOS: బైకర్ల వేటలో అటవీశాఖ.. నెట్టింట్లో వీడియో వైరల్

Posted: 11/09/2017 12:26 PM IST
Bikers chasing lion lioness in gujarat s gir on video probe ordered

ఇంట్లోని బొద్దింకలను చూస్తేనే కొంతమంది కెవ్వును కేకపెట్టి.. భయంతో గంతులేస్తారు. ఇక మరికోందరు విషజంతువులను చూస్తే భయానికి లోనవుతారు. ఇలా ఇంకోందరు మాత్రం ఏకంగా క్రూర మృగాలను చూసినప్పుడు మాత్రమే భయాందోళనకు గురవుతారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్న ఈ వీడియోలోని యువకులు మాత్రం ఏకంగా క్రూర మృగాలనే కంగారెత్తించేశారు. అలాంటిలాంటి క్రూరమృగాలు కావు.. అడవికే రారాజులుగా వెలుగొందుతున్న మృగరాజులనే కంగారెత్తించారు.

ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే మీ ప్రశ్నలకు.. గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో తీసిన వీడియోనే మీకు సమాధానం చెబుతుంది. ఈ వీడియోలో గిర్ అభయారణ్యం గుండా బైక్ పై వెళ్తున్న యువకులకు సింహాలు తారసపడ్డాయి. దీంతో ఆ యువకులు వాటిని వెంబడిస్తూ.. భయపెడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ అధికారులు విచారణకు ఆదేశించారు.

బైకుల ఎక్స్ లేటర్ ను పెంచుతూ, వాటి వెనుక పరుగులు తీయిస్తుంటే, తమకు ఎదురవుతున్న ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఆ సింహాలు పరుగులు తీశాయి. ఏషియన్ లయన్ జాతికి చెందిన సింహాలు ఉరుకులు పెడుతుంటే, మొత్తం నలుగురు యువకులు వాటి వెంట పడి తమ రాక్షసానందాన్ని తీర్చుకున్నారు. అయితే అభయారణ్యంలోకి బైకులతో చొరబడింది ఎవరన్న విషయాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీడియో ఎక్కడి నుంచి, ఎవరి పేరిట అప్ లోడ్ అయిందో తెలుసుకుని నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles