Country’s first cashless village goes back to cash నోట్ల రద్దు తరువాత ఏడాదికి ‘‘క్యాష్ లెస్ విలేజ్’’ ఇలా

One year after demonetisation country s first cashless village goes back to cash

demonetisation anniversary, demonetisation, demonetisation on year later, demonetisation dhasai village, first cashless village, dhasai digital economy, point of sale machine, e-wallet, paytm, freecharge, demonetisation news

with new currency, cashless payment has taken a backseat. surcharge on digital transactions is stopping people from opting for cashless payments.

నోట్ల రద్దు తరువాత ఏడాదికి ‘‘క్యాష్ లెస్ విలేజ్’’ ఇలా

Posted: 11/08/2017 06:00 PM IST
One year after demonetisation country s first cashless village goes back to cash

దేశంలో పెద్దనోట్ల రద్దు ప్రకటించి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. దేశ అర్థిక సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది గత ప్రభుత్వాలేవీ చేయలేని అత్యంత సాహసోపేత నిర్ణయమని.. కొద్ది రోజులు ప్రజలు అవస్థలు పడినా.. అ తరువాత క్రమంగా దేశ అర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో పాటు అవినీతి, నల్లధనం, ఉగ్రవాద సహకారం అన్ని అగిపోతాయని కూడా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు.

అయితే సరిగ్గా వారం రోజుల వ్యవధి తరువాత ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో.. తన మాటను మార్చింది. ఇక అదే సమయంలో దేశ సరిహద్దులోకి చోచ్చుకువచ్చిన ఉగ్రవాది నుంచి కూడా ఏకంగా కొత్తగా విడుదల చేసిన రూ.2 వేల నోటు లభ్యం కావడంతో కూడా విమర్శలు వెల్లివిసిరాయి. ఇక దీంతో అసలు తమ ప్రభుత్వం ఉద్దేశ్యం దేశాన్ని క్యాష్ లెస్ ఇండియాగా మారుద్దామని, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్నది కూడానని చెప్పారు.

అయితే తీరా ఏడాది కాలంగా విపక్షాల కాలం గడిచిన తరువాత మాత్రం మోడీ నిర్ణయాలను దేశప్రజలను అమోదించలేదని దేశ తొలి క్యాష్ లెస్ గ్రామాలే చాటుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని బడంఝిరా గ్రామాన్నిదేశ తొలి ‘క్యాష్‌లెస్ విలేజ్‌’గా ప్రకటించింది. దీనికితోడు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని దేశమంతా ముందుకు నడవాలని ఉద్భోద చేసింది. అయితే మీడియాకు అందిన సమాచారం ప్రకారం భోపాల్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడంతా నగదు వ్యవహారాలే నడుస్తున్నాయి.

గ్రామాన్ని క్యాష్‌లెస్ గా ప్రకటించిన సందర్భంలో ఆ గ్రామంలో విరివిగా పీఓఎస్ మిషన్లు వినియోగించేవారు. ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది. చాలామంది వ్యాపారులు ఆ మిషన్లను తిరిగి బ్యాంకులకు ఇచ్చేశారు. దీనికి కారణం ఇక్కడ చాలా తక్కువమంది మాత్రమే క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వహిస్తున్నారని వ్యాపారులు తెలిపారు. పైగా పీఓఎస్ మిషన్లను ఉంచుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం లేదని తేల్చిచెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles