girl turns bride in friends marriage in trichy అతిధిలా వచ్చింది.. వధువుగా పెళ్లి చేసుకుంది..

Girl turns bride in friends marriage in trichy

odion tuns bride, bride friend marries groom, friend turns bride to maryy groom, thichy Police, marriage, bride, minor girl, friend, odion, vegetable seller, venkateshan, thuraiyur

Police interupted a marriage alleging that the bride is minor girl, after this scene a friend of her turned bride to marry a vegetable seller venkateshan in thuraiyur.

అతిధిలా వచ్చింది.. వధువుగా పెళ్లి చేసుకుంది..

Posted: 11/03/2017 10:15 AM IST
Girl turns bride in friends marriage in trichy

తన న్నేహితురాలి పెళ్లికి వచ్చిన ఓ యువతి అనూహ్యంగా పెళ్లి కూతురుగా మారంది. వదువుగా మారి వరుడ్ని పరిణయమాడింది. అక్కడే వున్న అమె కుటుంబసభ్యులు కూడా దీనిని స్వాగతించి.. వధూవరులను అశీర్వదించారు. అచ్చంగా సినిమా పక్కిలో జరిగిన ఈ ఘటన.. కళ్యాణ ఘడియ వస్తే.. కాగల కార్యం గంధర్వేలే తీరుస్తారన్న విషయాన్ని రుజువుచేయడంతో పాటు పెద్దలు చెప్పిన మాట చద్దన్నం మూట అని కూడా నిరూపించింది.

వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చిలోని తురైయూరుకు చెందిన వెంకటేశన్ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. మన్నసనల్లూరుకు చెందిన కనకతో వెంకటేశన్‌కు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. బుధవారం వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే సినిమాల్లోలా సరిగ్గా వరుడు తాళి కట్టే సమయానికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ‘ఆపండి’ అంటూ పెళ్లి తంతును ఆపించారు.

వధువు ఇంకా మైనర్ కాబట్టి ఈ వివాహం చట్టప్రకారం నేరం అవుతుందని చెప్పడంతో అందరూ బిక్క మొహం వేశారు. తమ స్థోమతకు మించి పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేయగా,, పోలీసులు వచ్చి పెళ్లిని నిలిపేయడంతో.. వరుడి బంధవులు కలత చెందారు. తమ బంధువులు అందరి మధ్యలో తమ పరుపు ప్రతిష్టలు మసకబారడం ఇష్టంలేని వరుడి బందువులు.. ఎలాగైనా వివాహం జరిపించాలని నిర్ణయించిన వరుడి తరపు బంధువులు పెళ్లి కొచ్చిన అమ్మాయిల్లో వధువు కోసం వెతికారు. చివరికి వెంకటేశన్ దూరపు బంధువు కుమార్తెను ఎంపిక చేసి అనుకున్న సమయానికి వివాహం జరిపించి ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thichy Police  marriage  bride  minor girl  friend  odion  vegetable seller  venkateshan  thuraiyur  

Other Articles