Banks shutter ATMs as cities go digital మరో బలవంతపు అచరణ.. ఏటీయం కేంద్రాల తగ్గింపు

Banks shutter atms as cities go digital remove 358 over june august

demonetisation, ATMs, Digital India, SBI, HDFC bank, digital transactions, cashless transactions, union government, service charge

Decreasing ATM use in cities after demonetisation, and the increase in operational costs have forced banks to take a hard look at how they deploy ATMs.

మరో బలవంతపు అచరణ.. ఏటీయం కేంద్రాల తగ్గింపు

Posted: 10/28/2017 01:52 PM IST
Banks shutter atms as cities go digital remove 358 over june august

కేంద్ర ప్రభుత్వం మరో మారు బలవంతపు నిర్ణయం తీసుకోనుందా..? అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. ఇప్పటికే నోట్ల రద్దు నేపథ్యంలో విమర్శలను ఎదుర్కొంటున్న కేంద్రం. ఈ అంశంలో విపక్షాలు ఎన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినా వ్యూహాత్మక మౌనం తప్ప మాట మాట్లాడని కేంద్రం.. మరో బలవంతపు నిర్ణయాన్ని అచరణించేలా చేస్తుందా  అంటే అవునన్నే సమాధానమే వినబడుతుంది. ఈ సారి ఈ నిర్ణయం తీసుకుంది కూడా అర్థిక శాఖకు సంబంధించినదే.

అయితే నేరుగా కాకుండా బ్యాంకులకు ఈ మేరకు అదేశాలిచ్చి.. వాటితో అచరించేలా చేస్తున్నాయి. అదేంటంటే.. ఎనీ టైం మనీగా మన్ననలు పొంది.. ప్రజలకు 24 గంటలూ.. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవనే వెసలుబాటు కల్పించిన ఏటీయంలు ఇక ఎక్కడపడితే అక్కడ కనిపించినా.. అవి పనిచేయకపోవచ్చు. ఇవి త్వరలో అక్కడక్కడ మాత్రమే కనిపించనున్నాయి. అన్ని బ్యాంకులు కొత్త ఏటీయం ఏర్పాట్లను పక్కనబెట్టి.. ఉన్నవాటిని తీసేయటానికి రెడీ అయ్యాయి.

ఇప్పటికే నగరాలలో వీటిని సంఖ్యను తగ్గించేశాయి బ్యాంకులు. దీంతో బలవంతంగా నగదు రహిత లావాదేవీలను బలవంతంగా అచరించేలా చేస్తున్నాయి బ్యాంకులు. ఇక ఇందుకు పెరుగుతున్న లావాదేవీలే కారణమని చెబుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది (2017) జూన్ నుంచి ఆగస్ట్ అంటే.. మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా 358 ఏటీఎంలను శాశ్వితంగా మూసివేశాయి వివిధ బ్యాంకులు. గత నాలుగేళ్లలో ఏటీఎంల ఏర్పాటులో 16.4శాత వృద్ధి సాధించగా, ఈ మూడు నెలల్లో మాత్రం ఏకంగా 0.16శాతం తగ్గింది.

దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 59వేల 291 ఏటీఎంలు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 59వేల 200కి తగ్గిది అంటే 91 ఏటీఎంలు మూసివేసింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 419, హెచ్డీఎప్సీ బ్యాంక్ ఐదు ఏటీఎంలను మూసివేసింది. మిగతా బ్యాంకులు కూడా మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో వీటి సంఖ్య సగానికి పడిపోనున్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి. అయితే నిర్వహణ ఖర్చు, అద్దె, విద్యుత్ బిల్లు ఇలా అన్ని కలిపి నగరాల్లో ఖర్చు అధికమవుతుందని భావిస్తున్న బ్యాంకులు ఏటీయం కేంద్రాలను తగ్గించాలని భావిస్తున్నాయి. కానా నగదు లావాదేవీలు జరిపే వారిపై మాత్రం రెండు శాతం సర్వీసు చార్జీలను వడ్డీంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  ATMs  Digital India  SBI  HDFC bank  

Other Articles