BJP leader caught on camera bashing up wife భార్యపై బీజేపి నేత గృహహింస..

Bjp leader caught on camera bashing up wife

domestic violence, Crime against women, CCTV footage ,BJP, Agra Dowry, menace of dowry, love marriage, dowry, violence aginst women, crime

A senior BJP party worker was caught in a CCTV camera assaulting his wife. The incident took place in Shivalik apartment, New Lawyers colony under the jurisdiction of New Agra police

బీజేపి నేత గృహహింస.. భార్యనే నమ్మనోడు జనాన్ని నమ్ముతాడా.?

Posted: 10/28/2017 12:05 PM IST
Bjp leader caught on camera bashing up wife

లోకం పోకడ తెలియని బడుగులు కూడా తమ ఇంటి ఇల్లాలిని గౌరవంగా చూసుకుంటారు. కానీ కొందరు మాత్రం వారి నుంచి అడిగిన కట్నం తీసుకురాలేదనో, లేక తనను మద్యం తాగద్దని నిత్యం వేదిస్తుందనో చేయి చేసుకున్న సందర్భాలున్నాయి. అయితే ఇక్కడ ఓ బీజేపి నేత మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడా..? అన్న అనుమానం కలిగేలా చర్యలను చేపట్టాడు. తన అనుచరులతో వచ్చి భార్యపై చేయిచేసుకున్నాడు.

అంతేకాదు అమె బట్టాలను చించిసి.. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి గేటు వద్ద పడేశాడు. అపై అమెపై దాడి కూడా చేశాడు. ఈ అవమాన భారాన్ని భరించలేక అమె పోలీసుల వద్ద సాక్ష్యాధారాలతో కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో లాయర్స్ కాలనీలోని శివాలిక్ అపార్టుమెంట్స్ లో బీజేపీ సీనియర్ నేత వినయ్ శర్మ, అతని భార్య నుపుర్ శర్మ నివాసం ఉంటున్నారు. నుపుర్ శర్మను వినయ్ శర్మ ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఉన్నట్టుండి వినయ్ లో ఆమె మీద అనుమానం మొదలైంది.

దీంతో నుపుర్ కు అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ, వినయ్ శర్మ రోజూ పీకల్దాకా మద్యం తాగి ఇంటికి రావడం, ఆమెను చితక్కొట్టడం చేస్తున్నాడు. తాజాగా తన పదిమంది అనుచరులతో పాటు వచ్చి, ఆమె దుస్తులు చించి మరీ కొట్టి, కొడుకుని తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో అవమానంగా భావించిన ఆమె సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వినయ్ శర్మపై పోలీసులు ఐపీసీ 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక తనపైనే తన భార్య కేసు నమోదు చేయించదన్న విషయాన్ని కూడా జీర్ణంచుకోలేని వినయ్ శర్మ.. కౌంటర్ గా తన భార్యపై కూడా ఓ కేసు నమోదు చేయించాడు. తన భార్య బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లడమే కాకుండా, తనను చంపుతానని బెదిరిస్తోందంటూ వినయ్ శర్మ ఫిర్యాదు చేశారు. వీడియో ఫూటేజీలో స్పష్టంగా ఎవరు దౌర్జన్యం చేశారో కనిపిస్తున్నా.. బీజేపి నేత కావడంతో కిమ్మకుండా పోలీసులు ఆ కేసును కూడా ఫైల్ చేశారు. దీంతో భార్యనే నమ్మని నేత.. ఇక జనాన్ని ఎలా నమ్ముతాడని ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles