world bank survey on jan dhan bank accounts record జన్ ధన్ అకౌంట్లలో రికార్డు ఎందకంటే..

World bank survey on jan dhan bank accounts record

prime minister, PM Modi, jan dhan accounts, record of jan dhan, zero balance accounts, jan dhan account holders, funds transfer, world bank survey

prime minister jan dhan accounts record of zero balance is because of account holders thinking of govt transfers funds into their accounts says world bank survey

జన్ ధన్ అకౌంట్లలో రికార్డు ఎందుకంటే.. ప్రపంచ బ్యాంకు సర్వే నిజాలు

Posted: 10/28/2017 11:18 AM IST
World bank survey on jan dhan bank accounts record

ప్రధాని నరేంద్ర మోదీ జన్‌ ధన్‌ యోజన ఖాతాలను తెరవాలని పిలుపునిచ్చిన దానికి కూడా గడువులను పెట్టిన నేపథ్యంలో ప్రజలు అయన ప్రభుత్వంపై ఎన్నో అశలు పెట్టుకున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. డిజిటల్ సేవలు, నగదు లావాదేవీల నిర్వహణతో పాటు, ప్రభుత్వ పథకాలు నేరుగా తమకు చేర్చేందుకు జన్ ధన్ యోజన ఖాతాలు తెరవాలని ఆయన పిలుపునిచ్చారని జన్ ధన్ యోజజ లబ్దిదారులు భావించారని సర్వే తేల్చింది. అందుకనే దేశంలోని కోట్లాది మంది ప్రధాని పిలుపుకు స్పందించి జన్ ధన్ ఖాతాలు తెరిచారని తెలిపింది.

తాజాగా వరల్డ్ బ్యాంక్ జన్ ధన్ యోజనా అకౌంట్లపై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జన్ ధన్ ఖాతాలు తెరవడం వెనుక ప్రజలు భావించిన కారణాలు వెల్లడయ్యాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో వరల్డ్ బ్యాంక్ ఈ సర్వే నిర్వహించింది.  జన్ ధన్ ఖాతా ఓపెన్ చేసిన తరువాత ప్రభుత్వం ఆయా ఖాతాల్లో నగదు వేస్తుందని అత్యధికులు భావించినట్టు సర్వేలో తేలింది. 46% మంది బీహారీలు మోదీ విదేశాల నుంచి నల్లధనాన్ని వెలికి తీసి, ఆ డబ్బును ఈ ఖాతాల్లో వేస్తారని భావించగా, మరికొందరు ప్రభుత్వం ఐదు వేల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుందని ఆశించినట్టు సర్వే తెలిపింది.

ఇలాంటి ఆలోచనలే 31% మంది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వాసులకు కూడా ఉన్నాయని తెలిపింది. ఖాతాలు తెరవగానే 5000 రూపాయలు వచ్చి తమ ఖాతాల్లో పడిపోతాయని ఆశించినట్టు  పేర్కొన్నారు. ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాల కింద సబ్సిడీ మొత్తాలను కూడా ఈ ఖాతాల్లో వేస్తుందని రాజస్థాన్‌, హర్యాణా, బిహార్ రాష్ట్రాల ప్రజలు భావించినట్టు తెలిపింది. ఇలా ప్రభుత్వం 5,000 రూపాయల నుంచి లక్షన్నర రూపాయలు తమ ఖాతాల్లో వేస్తుందని భావించారని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles