Now Jio Rs 1500 Phones are Blasting జియో ఫీచర్డ్ ఫోన్ పేలుడు.. నాణ్యతలో తిరుగులేదన్న సంస్థ

Jio phone explodes while charging company denies qc issues

Jio Phone, Lyf Water 1, Phone Charger, Battery, India Ka Smartphone, technology, featured phones, smart phones, mobiles

A Jio Phone in Kashmir exploded while charging, with the back of the phone completely burnt and melted.

జియో ఫీచర్డ్ ఫోన్ పేలుడు.. నాణ్యతలో తిరుగులేదన్న సంస్థ

Posted: 10/23/2017 08:20 PM IST
Jio phone explodes while charging company denies qc issues

కాదేఫోన్ పేలుడుకు అనర్హం.. అంటూ నేటి స్మార్ట్ ఫోన్ అభిమానులు కోత్త కవిత్యాలు రాస్తున్న క్రమంలో.. అదే తరహాలో కాదే ఫీచర్డ్ ఫోన్ పేలుడుకు అనర్హం అంటూ రాసేస్తున్నారు.. ఇప్పటి ఫీచర్డ్ ఫోన్ ప్రియులు. ఇందగలదు.. అందుగలదన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా పెలుడు సంభవించు అన్నట్లుంది వయ్యారం అని అశ్చర్యపోక తప్పదు. అయితే అన్నింటికీ మించి ముందుగా పేలుతున్నవన్నీ చైనా ఫోన్లే అని కోట్టిపారేసినా.. ఆ తరవాత మాత్రం శాంసంగ్ ఫోన్లు కూడా పేలుడం ప్రారంభించాయి. నాణ్యతలో ఉన్నత ప్రమాణాలు పాటించే ఐపోన్ కూడా పేలుతుండటంతో విస్మయానికి గురయ్యారు స్మార్ట్ ఫోన్ ప్రియులు.

ఇక తాజాగా ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టిన జియో ఫోన్ కూడా పేలిందన్న వార్త హల్ చల్ చేస్తోంది. కాశ్మీర్ లో ఓ వ్యక్తి ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన జియో ఫోన్ పేలిందని రాడార్ అనే టెక్నాలజీ బ్లాగ్ దీన్ని ప్రచురించింది. ఫోన్ బ్యాక్ ప్యానల్ మొత్తం దెబ్బతిన్న ఫొటో కూడా పోస్ట్ చేసింది. రాడార్‌ అందించిన నివేదిక ప్రకారం చార్జింగ్‌ లో ఉండగా జియో ఫీచర్‌ పోన్‌ పేలింది. హ్యాండ్‌సెట్‌  వెనక భాగం పూర్తిగా కాలిపోయింది. కరిగిపోయినట్టు రిపోర్ట్‌ చేసింది. జియో ఫోన్ పేలింది అన్న సమాచారం ఒక్కసారిగా కలకలం రేపింది. రాడార్ కథనాన్ని కోట్ చేస్తూ.. జాతీయ వెబ్ పోర్టల్స్ సైతం జియో ఫోన్ పేలుడుని ప్రముఖంగా హైలెట్ చేశాయి. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

జియో ఫోన్ పేలుడుకి సంబంధించి నిజమా కాదా అనే విషయంపై కంపెనీ కూడా రంగంలోకి దిగింది. ఈ వార్తపై వివరణ ఇచ్చింది. ఈ సమాచారం మా దృష్టికి కూడా వచ్చిందని స్పష్టం చేసింది జియో. ఇది కొందరు కావాలని సృష్టించారని.. ఎవరూ నమ్మొద్దని చెప్పింది. ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలలేదని తెలిపింది. దీని వెనక ఏదో జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది. జియో ఫీచర్ ఫోన్ అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు అయ్యిందని వివరణ ఇచ్చింది. అన్నీ పరిశీలించిన తర్వాతే బయటకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై మరింత విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. జియో వివరణ తర్వాత రాడార్ వెబ్ బ్లాగ్ నుంచి జియో పేలుడు వార్తను తొలగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles