Jilted lover stabs married woman at erragadda rythu bazar తనను ప్రేమించడం లేదని వివాహితపై కత్తితో యువకుడి దాడి

Jilted lover stabs married woman at erragadda rythu bazar

Jilted lover, stabing, married woman, erragadda, rythu bazar, SR Nagar police, Hyderabad Police, Telangana, crime

A jilted lover allegedly stabbed married woman on monday noon at erragadda rythubazar which is in the heart of the Hyderabad city in the limits of SR nagar police station.

తనను ప్రేమించడం లేదని వివాహితపై కత్తితో యువకుడి దాడి

Posted: 10/23/2017 05:42 PM IST
Jilted lover stabs married woman at erragadda rythu bazar

హైదరాబాదులో పట్టపగలు దారుణం జరిగింది. ఎర్రగడ్డలోని రైతుబజార్ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వివాహితను ఓ అగంతకుడు కత్తితో దాడి చేయడం పెను కలకలం రేపింది. ఈ ఘటనతో నిత్యం రద్దీగా వుంటే ఎర్రగడ్డ రైతుబజార్ ప్రాంతంలో ఒక్కసారిగా బీతావాహ వాతావరణ అలుముకుని కొద్ది సేపు ఉద్రిక్తంగా మారింది. తీవ్రగాయాలపాలైన వివాహితను పరిస్థితిని చూసిన స్థానికులు వెంటనే 108 అంబులెన్సుకు కాల్ చేయగా, వారు అమెను స్థానికంగా గల అసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు.

వివాహితపై దాడి చేసిన యువకుడ్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన ఎస్సార్ న‌గ‌ర్‌ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాధిత వివాహిత ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. నిందితుడి పేరు ర‌వి అని, త‌నను స‌ద‌రు వివాహిత‌ ప్రేమించ‌డం లేద‌ని ఆ యువ‌కుడు ఈ దారుణానికి పాల్పడ్డాడ‌ని పోలీసులు చెప్పారు.   

కాగా, యువకుడు రవి తనను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడని, తనను ప్రేమించాల్సిందిగా తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నాడని బాధితురాలు ఇప్పటికే రెండు పర్యాయాలు ఎస్సార్ నగర్ పోలిస్ స్టేషన్ లో యువకుడిపై పిర్యాదు చేసింది. తాను వివాహితనని చెప్పినా వినిపించుకోకుండా వెంటపడుతున్నాడని అమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు కూడా తెలిపింది. అయితే యువకుడిపై చర్యలకు పోలీసులు ఉపక్రమించలేదు. కేవలం అతడ్ని మందలించి వదిలిపెట్టారని బాధితురాలి అరోపించింది. దీంతోనే అతను తనపై కత్తితో దాడి చేశాడని అరోపించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jilted lover  stabing  married woman  erragadda  rythu bazar  SR Nagar police  Hyderabad Police  Telangana  crime  

Other Articles