కాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను గణనీయంగా రాబడుతున్న హీరో విజయ్ తాజా చిత్రం 'మెర్సెల్'అదే స్థాయిలో రాజకీయపరంగా వివాదాస్పదమైంది. చిత్ర విజయానికి ఇది కూడా ఓ కారణం కావచ్చునని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్న క్రమంలో ఈ చిత్రం చుట్టూ చిత్రంలోని పలు డైలాగులు వివాదాస్పందగా వున్నాయంటే ఓవైపు ప్రకంపనలు రేగుతుండగానే.. అంతకుమించిన సినీ, రాజకీయ ప్రముఖుల మద్య డైలాగులు మరింత వివాదాస్పదంగా మారుతున్నాయి.
చిత్రంలో జీఎస్టీపై వున్న డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్.రాజా ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను 'మెర్సెల్' పైరసీ కాపీని చూశానని... సినిమాలోని డైలాగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని వ్యాఖ్యానించడం సీనీ, రాజకీయ ప్రముఖుల మధ్య వివాదానికి అజ్యం పోసింది. సాంకేతిక విప్లవంతో ఏడాది పాటు అడాల్సిన చిత్రాలు కేవలం కలెక్షన్ల పరంగా హిట్ అయ్యాయా..? లేదా..? అన్న స్థాయికి వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో బీజేపి నేత వ్యాఖ్యలపై హీరో విశాల్ మండిపడ్డాడు. ఒక జాతీయ నేత స్థాయిలో ఉండి పైరసీ సినిమా చూశానని చెప్పడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంఘంలో పెద్దమనిషిగా ఉంటూ, పైరసీ సినిమా చూశానని చెప్పడానికి సిగ్గు లేదా? తప్పులు మీరు చేస్తూ.. నీతులు మాత్రం ప్రజలకు చెబుతారా..? అంటూ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇలాంటి పని చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని... పైరసీ లింకులను తొలగించడానికి ప్రభుత్వానికి సహకరించాలని డిమాండ్ చేశాడు. మరో సీనియర్ నటుడు పార్తీబన్ కూడా హెచ్ రాజా వ్యాఖ్యలను తప్పుబట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more