lessons on advantages of dowry in textbook of College వరకట్నం లాభాలపై పుస్తకాల్లో పాఠాలా..? నెట్టింట్లో వైరల్

Dowry can help you get married to unwilling men claims textbook

Dowry, advantages of dowry, menace of dowry, dowry st joseph's college bangalore,st. joseph's college sociology., dowry deaths, dowry deaths india, dowry deaths india 2017, st. joaeph's college dowry advantages, crime

Are you 'ugly'?Do you want unwilling men to marry you? then pay dowry says a textbook circulated in a reputed college of Bangalore, which gone viral on social media.

వరకట్నం లాభాలపై పుస్తకాల్లో పాఠాలా..? నెట్టింట్లో వైరల్

Posted: 10/21/2017 12:45 PM IST
Dowry can help you get married to unwilling men claims textbook

కట్నం ఇవ్వటం, తీసుకోవటం నేరంమని సభ్య సమాజంలో దీనికి చోటేలేదని ఇచ్చిన వారితో పాటు తీసుకున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చట్టం చెబుతుంటే.. వరకట్నం అన్నది సమాజంలో గుర్తింపు వున్నదని, దీని వల్ల ప్రత్యేకమైన లాభాలు కూడా వున్నాయని ఓ విద్యా సంస్థ పేరుతో ప్రత్యేక వ్యాసం ప్రస్తతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కర్నాటక రాజధాని బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీ ఇందుకు సంబంధించిన ఓ సబ్జెక్ట్ కూడా పెట్టేసిందని సోషల్ మీడియాలో బాహాటంగా కూసేస్తుంది.

అసలు ఈ కూతలన్ని నిజమేనా.. కాదా.? అని అరా తీస్తే.. దీనిని తీవ్రంగా ఖండించిన యాజమాన్యం.. ఇది కేవలం తమ కళాశాలను అప్రతిష్ట పాలు చేసేందుకు ఎవరో పన్నిన కుతంత్రమని అంటోంది. ఇలాంటి సబ్జెక్ట్ ఎవరైనా బోధిస్తారా..? అంటూ కళాశాల అధికారి కిరణ్ జీవన్ ఎదురు ప్రశ్నించారు. తమకు సంబంధం లేకుండానే మా పేరుతో ఇది సోషల్ మీడియాలో తిరుగుతుందని.. ఇలాంటి వాటిని ఖండిస్తున్నామని ప్రకటించారు.

ఎవరు ఎన్ని చెప్పినా ఇంత పక్కాగా లెటర్ ఫేస్ బుక్, వాట్సాప్ లో విపరీతంగా షేర్స్ అవుతోంది. బెంగళూరులోని ఓ కాలేజీలో కట్నంపై ఈ విధమైన సబ్జెక్ట్ ఉందని ప్రచారం జరుగుతుంది. అడ్వాంటేజీస్ ఆఫ్ డౌరీ పేరుతో ఉన్న లెటర్ నిజమా కాదా.. ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయమై రంగంలోకి దిగిన బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేజీలో 159 అనే సంఖ్య కూడా ఉంది. ఈ అంకెను చూస్తుంటే ఇది పుస్తకంలోనిదే అయ్యి ఉంటుందని నెటిజన్లు గట్టిగా చెబుతున్నారు.

ఇక వారు పేర్కొంటున్న కట్నం వల్లే లాభాలు ఏంటో చూద్దామా.!

* కట్నం ఎక్కువగా ఇచ్చి పెళ్లి చేసిన వారిని సమాజం ప్రత్యేకంగా గుర్తిస్తుంది.
* కట్నం ఎక్కువ తెచ్చిన అమ్మాయిని అత్తింట్లో గౌరవంగా చూస్తారు. ప్రేమగా చూసుకుంటారు.
* అంద విహీనంగా ఉన్న అమ్మాయిలకు త్వరగా పెళ్లి చేయవచ్చు.
* అందమైన అబ్బాయిలను కట్నం ఎరవేసి పెళ్లి చేసుకోవచ్చు. డబ్బుతో దక్కించుకోవచ్చు.
* కట్నం వల్ల పెళ్లి తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉండవు. జీవితం హాయిగా సాగిపోతుంది.
* మెరిట్ విద్యార్థుల ఉన్నత చదువులకు కట్నంతో వచ్చే డబ్బు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
* కట్నం ఇచ్చి పంపిస్తే ఆస్తిలో వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కూడా అమ్మాయి ఇంటి వారికి లాభం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : advantages of dowry  st joseph college  bangalore  cyber crime police  dowry menace  crime  

Other Articles