missing inter student sai prajwala safe in uppal సాయి ఇంట్లో ప్రజ్వలించిన దీపావళి.. ఉప్పల్ లోనే ఇంటర్ బాలిక

Missing inter student sai prajwala safe in uppal

sai prajwala safe at uppal, narayana college student safe at uppal, narayana coaching centre, narayana hostel, sai prajwala, student, bandlaguda, Hyderabad, Telangana, rachakonda police, telangana police, crime

Sai Prajwala, an 18-year-old student of medicine at Narayana Coaching Centre, Bandlaguda, who ran away from home leaving behind a letter demanding to shut down narayana college is safe at uppal.

సాయి ఇంట్లో ప్రజ్వలించిన దీపావళి.. ఉప్పల్ లోనే ఇంటర్ బాలిక

Posted: 10/20/2017 11:22 AM IST
Missing inter student sai prajwala safe in uppal

మెడికల్ ఎంట్రెస్ కోసం నీట్ పరీక్షల శిక్షణ పోందుతున్న విద్యార్థిని సాయి ప్రజ్వల ఇంట్లో ఈ దీపావళి నిజంగానే కొత్త శోభతో ప్రజ్వలించింది. నారాయణ కాలేజీలో విద్యార్థులపై సాగుతన్న మానసిక వేదన భరించలేక.. ఆ కాళాశాలలను మూసివేయించాలని డిమాండ్ చేస్తూ ఇంట్లోంచి వెళ్లిపోయిన సాయి ప్రజ్వల అచూకీ లభ్యమైంది. కాళాశాలో అధ్యపకులు పెడుతున్న మనోవేధనను భరించలేక నోట్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిన ఈ విద్యార్థిని ఎక్కడెళ్లిందో..? ఏమైందోనన్న అందోళన సర్వత్రా వ్యక్తమై తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

కాగా, రెండు రోజుల క్రితం సాయిప్రజ్వల మాదిరిగానే వున్న ఓ బాలిక తిరుపలితో కనిపించిందని, అమెను ప్రజ్వలగా భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. తిరుమల పోలీసులు సాయి ప్రజ్వల తండ్రితో పాటు తెలంగాణ పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో హుటాహుటిన తిరుపతికి వెళ్లిన ప్రజల్వ తండ్రి.. మార్గమథ్యంలో కనిపించిన దేవుళ్లకళ్లా తన కూతురు అచూకీ లభ్యం కావాలని వేడుకుంటూ తిరుపతికి చేరుకున్నా.. అక్కడ ఆయనకు నిరాశే ఎదురైంది. ప్రజ్వల మాదిరిగా వున్న అమ్మాయి తన కూతురు కాదని ఆయన అశలన్నీ అవిరయ్యాయని వెనుదిరిగాడు.

ఈ క్రమంలో ప్రజ్వల మిస్సింగ్  కేసు దర్యాప్తును చేపట్టిన పోలీసులు కూడా సీసీ కెమెరాల అధారాంగా అమె కోసం వెతుకుతూ ముమ్మర ధర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అమె  ఫిర్జాదిగూడలోని ఓ హాస్టల్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అమెకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం అమెను తల్లిదండ్రులకు అప్పగించారు. చదువులో ఒత్తిడితోనే సాయి ప్రజ్వల ఇంట్లోంచి వెళ్లిపోయిందని, అమెపై చదువుల విషయంలో ఒత్తిడి తీసుకురావద్దని కూడా వారి తల్లిదండ్రులకు కూడా సూచించినట్టు పోలీసులు తెలిపారు.

పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయి ప్రజ్వలను నాగోల్‌లోని నారాయణ కాలేజ్ లో చదువుకుంటోంది. రెండు నెలల క్రితమే తల్లిదండ్రులు చేర్పించారు. విద్యార్థిని ప్రజ్వల కాలేజ్ హాస్టల్ లో ఉండి శిక్షణ తీసుకుంటోంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి కాలేజ్ కు వచ్చింది. ఈ నెల 10న బోడుప్పల్‌ వెంకటసాయి నగర్‌లోని మామయ్య ఇంటికి వచ్చింది. మరుసటి రోజు అంటే ఈ నెల 11న ఓ లేఖ రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయింది.  అలా వెళుతున్న సందర్భంలో కాలనీలోని ఓ ఇంట్లోని సీసీ టీవీ ఫుటేజ్ లో ఆమె దృశ్యాలు రికార్డుకాగా, గుర్తించిన పోలీసులు అమె ఆచూకీని గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai prajwala  inter student  narayana college  narayana hostel  bandlaguda  Hyderabad  Telangana  crime  

Other Articles