Mock Drill at Polavaram Project | పోలవరం వద్ద పాక్ టెర్రరిస్టులు.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు

Firing at polavaram project

Polavaram Project, Pak Terrorist at Polavaram project, Polavaram Project Mock Drill, Mock Drill AP Police, Pakistan Terrorists in Andhra Pradesh

Andhra Pradesh Police Conducted Mock drill at Polavaram Project. Local Residents fear they don't know about that.

పోలవరం వద్ద కాల్పుల కలకలం

Posted: 10/18/2017 08:32 AM IST
Firing at polavaram project

ఇద్దరు వీఐపీల కిడ్నాప్.. ఉగ్రవాదులు.. ఆపై పోలీసుల రంగ ప్రవేశం... ఎదురు కాల్పుల సీన్... ఎలాగైతేనేం చివరకు వారిని విడిపించేశారు. కానీ, అది వాస్తవం కాదు. పోలవరం ప్రాజెక్టు వద్ద మంగళవారం పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఇద్దరు వీఐపీలను పాకిస్థాన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తే అక్కడ సీన్ ఎలా ఉంటుందో.. తాము ఎంత అప్రమత్తంగా ఉంటామో తెలియజేశారన్న మాట.

ఎస్పీ రవిప్రకాష్ పర్యవేక్షణలో ఈ మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. ముందుగా అక్కడ సన్నివేశాలు జరిగిన స్థానికులు ఒక్కసారిగా బయపడ్డారు. ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలతో ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను స్పెషల్ పార్టీ పోలీసులు అణువణువూ గాలించారు. తీవ్రవాదులను గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా వారిపై దాడికి దిగారు. ఉగ్రవాదులు ఎదురుకాల్పులు ప్రారంభించారు.

దీంతో ఆ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు మరొకరిని బందీగా పట్టుకున్నారు. వారి చెర నుంచి వీఐపీలను రక్షించారు. అయితే ఇదంతా ‘మాక్‌డ్రిల్’లో భాగమని పోలీసులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఈ మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles