ATMs to dispense new Rs 200 notes only by year-end రూ.200 నోట్లు.. ఏటీయంలలోనూ అందుబాటులోకి..!

Atms to dispense new rs 200 currency notes in new year 2018

Reserve Bank of India, Rs 200 notes, Rs 200 notes in ATMs, Rs 200 currency, Rs 200 notes in Banks, rs 200 note, Tata Communications, Sanjeev Patel, ATMs to dispense new Rs 200 notes, ATMs, RBI latest news

The recently introduced Rs 200 notes get dispensed through the country's ATMs in the New Year only. Most ATM makers cite non-availability of the notes, as a result of which there has been a lack of interest on the part of banks to get all their machines recalibrated.

రూ.200 నోట్లు.. ఏటీయంలలోనూ అందుబాటులోకి..!

Posted: 10/17/2017 01:19 PM IST
Atms to dispense new rs 200 currency notes in new year 2018

దేశంలో గతమెన్నడూ లేని కొత్త నోటును అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్రం.. దానిని దేశ ప్రజలందరి చేతికి అందించడంలో మాత్రం విఫలమైంది. దీంతో ఈ నోటును దేశ ప్రజలందరి చేతుల్లోకి వెళ్లేందుకు వీలుగా మరో ప్రత్యామ్నాయం చేసింది. రూ.100 నోటుకు ఐదువందల నోటుకు మధ్య చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టేందుకు వచ్చిన రూ.200 నోటును ఇప్పటికీ దేశంలోని దాదాపుగా 90 శాతం మంది కనీసం దర్శనానికి కూడా నోచుకోలేందంటే అతిశయోక్తి కాదు. దీంతో ఈ నోటును అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటుంది భారతీయ రిజర్వు బ్యాంకు.

దీంతో ఇక త్వందర్లోనే రూ. 200 నోటు కూడా ఏటీయం కేంద్రాలలో దర్శనమివ్వనుంది. తద్వారా ఈ నోటును దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. ప్రస్తుతానికి కేవలం బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న ఈ నోటు ఇక మరో రెండు నెల్లల్లో ఏటీఎంలలోకి రానుంది. అంటే రమారమి నూతన సంవత్సరానికి ఈ నోటును దేశవ్యాప్తంగా అన్ని ఏటీయం కేంద్రాలలో అందుబాటులో వుంచేందుకు అర్బీఐ సన్నహాలు చేస్తుంది. నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంలను రీకాలిబ్రేట్‌ చేసిన బ్యాంకులు మళ్లీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని, వాటిని రీకాలిబ్రేట్‌ చేయడానికి మరికొంత కాలం పట్టే అవకాశముందని ఎన్సీఆర్‌ ఎండీ నవ్రోజ్‌ డస్టర్‌ చెప్పారు. ఎన్సీఆర్‌ దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఏటీఎంలను నిర్వహిస్తుంది

ఏటీఎంలను రీకాలిబ్రేట్ చేయడం సులువైన పని అని ప్రజలు భావిస్తున్నారని, కానీ అది చాలా కష్టంతో కూడుకున్నది అని కెనరా బ్యాంక్‌ ఛైర్మన్‌ రాకేశ్ శర్మ అన్నారు. రీకాలిబ్రేషన్ కు చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియని, దీనికోసం వారాల తరబడి సమయం పడుతుందని చెప్పారు. పెద్దనోట్ల రద్దు సమయంలో రాత్రింబవళ్లు కష్టపడ్డామని, కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను రెండు వారాల్లో మార్చామని తెలిపారు. ప్రస్తుతం అంత తొందరపాటు ఏమీ లేదన్నారు. కొంత సమయం తీసుకుని ఏటీఎంలను రీకాలిబ్రేషన్ చేపడతామని రాకేశ్ శర్మ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rs 200 note  Tata Communications  Sanjeev Patel  ATMs to dispense new Rs 200 notes  ATMs  RBI  

Other Articles