Hyderabad cops clueless about missing student సాయ ప్రజ్వల ఎక్కడికెళ్లింది..? ఏమైంది.?

Cops clueless about missing narayana student

narayana college, coaching centre, narayana hostel, sai prajwala, student, bandlaguda, Hyderabad, Telangana, rachakonda police, telangana police, crime

Sai Prajwala, an 18-year-old student of medicine at Narayana Coaching Centre, Bandlaguda, reportedly ran away from home leaving behind a letter.

ఆ కాలేజీని మూసేవేయాలన్న సాయి ప్రజ్వల ఎక్కడికెళ్లింది..?

Posted: 10/16/2017 01:14 PM IST
Cops clueless about missing narayana student

మెడికల్ ఎంట్రెస్ కోసం నీట్ పరీక్షల శిక్షణ పోందుతున్న నారాయణ కాలేజీని మూసివేయించాలని డిమాండ్ చేస్తూ ఇంట్లోంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన సాయి ప్రజ్వల మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. నోట్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిన ఈ విద్యార్థిని ఎక్కడెళ్లిందో..? ఏమైందోనన్న అందోళన సర్వత్రా నెలకోంది. సాయిప్రజ్వల అచూకీ కోసం అమె కుటుంబ సభ్యులు తమ బంధువలు ఇళ్లలో వెతుకుతుండగా, ప్రజ్వల తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా సీసీ కెమెరాల అధారాంగా అమె కోసం వెతుకుతూ ముమ్మర ధర్యాప్తు చేస్తున్నారు.

కాలేజీలో ఒత్తిళ్ల వల్లే సాయి ప్రజ్వల ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లినట్టు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. సాయి ప్రజ్వల ఇంటి నుంచి వెళ్తుండగా కాలనీలోని ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డయ్యాయి. కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖని మండలం అడ్డగుంటపల్లికి చెందిన సాయి ప్రజ్వల హైదరాబాద్‌ సమీపంలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో బైపీసీ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటోంది. అయితే ఆమె తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తించి అమె తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం హాస్టల్ నుంచి తీసుకువచ్చి అమెను తమ బంధువుల ఇంట్లో ఉంచారు.

ఈ నేపథ్యంలో ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాన సాయిప్రజల్వ.. తాను ఎదుర్కోన్న మానసిక క్షోభ నేపథ్యంలో నారాయణా కాలేజీని మూసివేయాలని కోరింది. తాను అనుభవించిన అత్యంత పెద్ద టార్చర్ గురించి అమె కేవలం మూడు, నాలుగు వ్యాఖ్యల్లో చెప్పింది. నారాయణ కాలేజీ చదువు పేరుతో విద్యార్థులను చంపుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నారాయణ కాలేజీ, హాస్టల్ లో చదివే పిల్లలు ఎంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారని చెప్పింది. ఇలాంటి నారాయణ కాలేజీని మూసివేయాలని కోరింది.

మామయ్య ఇంటికి వచ్చి.. సేద తీరుతున్న తరువాత కూడా అమె కాలేజీలో తాను ఎదుర్కోన్న తీవ్ర ఒత్తిడికి తాలుకు ఘటనలను గుర్తుకురావడంతో.. లేఖ రాసి కనిపించకుండా పోయింది. కాలేజీలో ఏదో జరగటం వల్లే తమ బిడ్డ వెళ్లిపోయిందని విద్యార్థిని తండ్రి విద్యాగిరి శ్రీనివాస్‌ ఆరోపించారు. ఇటీవల కడప నారాయణ కాలేజీలో పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఒక్క ఈ వారం పది రోజుల్లోనే 8 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బోధపడుతోంది. ఈ మూడేళ్లలో ఒక్క ఏపీలోనే 60 మంది ఇంటర్‌ విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narayana college  coaching centre  narayana hostel  sai prajwala  student  bandlaguda  Hyderabad  Telangana  crime  

Other Articles