Sexual attacks: Delhi worst in world, says poll ఢిల్లీ.. ఆ విషయంలో ప్రపంచానికే రాజధాని..!

Sexual attacks delhi worst in world says poll

worst city in the world for sexual violence, Thomson Reuters Foundation, sexual violence against women, Nirbhaya gang-rape, National Crime Records Bureau,​ Women feel at risk of rape, sexual assault, brasil, new delhi, worst cities for women, women rape india, delhi rape capital, unsafe cities for women, crime

Delhi has been named as the worst megacity in the world for sexual violence against women, in a poll conducted by the Thomson Reuters Foundation.

ఢిల్లీ.. ఆ విషయంలో ప్రపంచానికే రాజధాని..!

Posted: 10/16/2017 10:02 AM IST
Sexual attacks delhi worst in world says poll

దేశరాజధానిలో మహిళల భద్రత ఎంత దారుణంగా వుందో ఈ సర్వే తేటతెల్లం చేస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా తొలిసారిగి ఇలాంటి అంశంపై ఓ సర్వే సంస్థ నిర్వహించిన పోల్ లో దేశరాజధాని ఢిల్లీ అపఖ్యాతిని, అప్రదిష్టను మూటగట్టుకుంది. ఇప్పటికే అత్యాచారాల రాజధానిగా పేరోందిన ఢిల్లీలో తమ శాంతిభద్రతలపూ మహిళలు ఎలాంటి అభిప్రాయంతో వున్నారు.. తమ వారి భద్రత నేపథ్యంలో నిత్యం మగవారు ఎలాంటి అభద్రతాభావంతో వున్నారన్న విషయాలు ఈ సర్వే దర్పణం పడుతుంది.

దాదాపుగా ఐదేళ్ల క్రితం జరిగిన నిర్భయ సామూహిక అత్యచారం కేసుకు వెలుగులోకి వచ్చి.. అమెకు అండగా అటుదేశ ప్రజలు, మరీ ముఖ్యంగా రాజధాని యువత న్యాయ కోసం నినదించినా.. ఆ తరువాత కూడా అనేక మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. అంతకు ముందు కూడా మహిళలపై అనేక లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయి. నేరాలను అదుపుల చేస్తామని.. అడపడచులకు అండగా వుంటామని అధికారంలోకి వచ్చన ప్రభుత్వాలు కేవలం తమ రాజకీయ లబ్దికే పాకులాడుతుండటంతో మహిళన భద్రత గాల్లో దీపంగా మారింది.

దీంతో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ యావత్ ప్రపంచంలో మొదటి నగరంగా నిలిచి.. అప్రదిష్టను మూటగట్టుకుంది. లండన్‌కు చెందిన థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. ఢిల్లీలోని మహిళలు నిత్యం లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, చిత్రహింసలు వంటి భయాలతో వణికిపోతుంటారని, ఆ నగరం భారత దేశ లైంగిక దాడుల కేంద్రంగా ఉందని కూడా ఆ సర్వే తెలిపింది. ప్రపంచంలోని మొత్తం 19 మహానగరాల్లో ఈ సంస్థ ఈ ఏడాది(2017) జూన్‌ నుంచి జూలై నెలల మధ్య సర్వే నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.

నిర్భయ ఘటన చోటు చేసుకొని ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఏమాత్రం మెరుగవకుండా మరింత దిగజారినట్లుగా నివేదిక రావడం గమనార్హం. మరోపక్క, ఢిల్లీతోపాటు బ్రెజిల్‌కు చెందిన సావ్‌ పౌలో నగరం కూడా ఈ వరుసలో నిల్చొంది. నేరం జరిగిన తరువాత చర్యలు తీసుకునే ఘటనలు కాకుండా నేరానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వాలు, పోలీసులు, న్యాయవ్యవస్థ చర్యలు తీసుకుంటే ఇలాంటి దారుణాలను నియంత్రించవచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles