US pulls out of UNESCO accusing it of 'anti-Israel bias' అగ్రరాజ్యం సంచలన నిర్ణయం.. అదే బాటలో ఇజ్రాయిల్

Israel joins us in quitting un heritage agency over anti israel bias

Unesco, United Nations, US foreign policy, Israel, anti-Israel bias, UN’s world heritage body, World news, US news

The United States has formally notified the UN’s world heritage body Unesco that it is withdrawing its membership of the organisation citing “continuing anti-Israel bias”.

అగ్రరాజ్యం సంచలన నిర్ణయం.. అదే బాటలో ఇజ్రాయిల్

Posted: 10/13/2017 10:01 AM IST
Israel joins us in quitting un heritage agency over anti israel bias

అగ్రరాజ్యం అమెరికానే తమకు మద్దతు పలుకుతూ ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ బాడీగా ప్రఖ్యాతి చెందిన యునెస్కో నుంచి బయటకు వచ్చిందని బావించిన ఇజ్రాయిల్ కూడా అదే బాటలో నడిచింది. అమెరికా అధికారిక కార్యాలయ భవనం శ్వేత సౌధం నుంచి అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ అధికారగణం తాము యునెస్కో నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించి కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయిల్ కూడా అలాంటి నిర్ణయాన్నే తీసుకునింది. యూనెస్కో యాంటీ ఇజ్రాయిల్ విధానాన్ని అవలంబిస్తుందని గత కొన్నేళ్లుగా అరోపిస్తూ వచ్చిన అగ్రరాజ్యం.. చివరకు తమ విదేశాంగ విధానానికి విలువనిస్తూ.. తమ మిత్రదేశం ఇజ్రాయిల్ కు మద్దతు పలుకుతూ యూనెస్కో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేష‌న్స్ ఎడ్యుకేష‌న‌ల్‌, సైన్‌టిఫిక్ అండ్ క‌ల్చ‌ర‌ల్ ఆర్గ‌నైజేష‌న్ (యునెస్కో) ఇజ్రాయెల్‌ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోందని అమెరికా ఆరోపిస్తూ తాము వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా యునెస్కో నుంచి తాము తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. యునెస్కో నుంచి వైదొలగేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాల్సిందిగా విదేశాంగ మంత్రిత్వ శాఖను నెతన్యాహు ఆదేశించారు. కాగా, యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను నెతన్యాహు స్వాగతించారు.

గతంలో కూడా అమెరికా ఇలాంటి సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొన్ని రోజుల ముందు 'పారిస్‌ ఒప్పందం' నుండి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచ‌ల‌న ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా, యునెస్కో నుంచి బయటకు వెళ్లేందుకు మాత్రం.. అది అవలంభిస్తున్న ఇజ్రాయెల్‌ వ్యతిరేక విధానాలనే అరోపించింది. ఈ విషయంపై యూనెస్కో తమ పాలసీకి సానుకూలంగా లేని కార‌ణంగా అమెరికా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ అంశంపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది డిసెంబరు 31 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు అమెరికా తెలిపింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles