OnePlus caught collecting sensitive user data మీది చైనా ఫోనేనా..? పర్సనల్ డేటా సేఫేనా..?

Oneplus caught collecting sensitive user data without permission

china phone, personal information, OnePlus, OnePlus 2, OnePlus 3, OxygenOS, OnePlus Privacy, How to OxygenOS, How to OnePlus, Chris Moore, security researcher

Security researcher claims OnePlus is gathering critical data such as serial number, IMEI number, wireless network IDs and timestamps for the screen on and screen off. Here’s how to keep your data secure.

మీది చైనా ఫోనేనా..? పర్సనల్ డేటా సేఫేనా..?

Posted: 10/12/2017 04:46 PM IST
Oneplus caught collecting sensitive user data without permission

చైనా మొబైల్ కంపెనీ వన్ ప్లస్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ కంపెనీ ఫోన్ వాడుతున్న వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సంస్థ వారి అనుమతి లేకుండా చౌర్యం చేస్తుందని ఆరోపణలను ఎదుర్కొంటుంది. అయితే ఈ అరోపణలను కంపెనీ వర్గాలు కూడా అంగీకరించిడం గమనార్హం. టైమ్ స్టాంప్, ఫోన్ యాక్టివేట్ అయిన తరువాత ఎప్పుడు స్టాండ్ బైగా వాడుతున్నామన్ని సమాచారంతో పాటు ఐఎమ్‌ఈఐ నంబర్లు, ఎంఏసీ అడ్రస్, ఫోన్ నెంబర్, వైర్ లెస్ నెట్ వర్క్, మొబైల్ నెట్ వర్క్ తదితర సమాచారాలను వన్ ప్లస్ దొంగమార్గంలో సేకరిస్తున్నందన్న సమాచారంతో కలకలం రేగుతుంది.

వన్ ప్లస్, వన్ ప్లస్ 2, వన్ ప్లస్ 3 ఫోన్ల ద్వారా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారని, అయితే తరువాత వచ్చిన వన్ ప్లస్ 2, 3 ల నుంచి అధికంగా వ్యక్తిగత సమాచారం ట్రాన్స్ ఫర్ అయినట్లు సెక్యూరిటీ రీసర్చర్ క్రిష్టోఫర్ మూరే వివరించారు. తన బ్లాగ్‌లో ఈ విషయంపై పూర్తి సమాచారం అందించారు. తమ వన్‌ప్లస్ ఫోన్లకు సంబంధించి వినియోగదారులకు ఎదురవుతున్న సమస్యలను, లోపాలను గుర్తించి.. వాటిని భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చేసేందుకే సేకరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. తన ఫోన్‌లో డేటాను తస్కరించినట్లు క్రిష్టోఫర్ గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
అంతేకాదు, అలా దొంగిలించిన అతని వ్యక్తిగత సమాచారాన్ని వన్‌ప్లస్ కంపెనీ సొంత సైటైన అమెజాన్ ఏడబ్య్లూఎస్‌లో అప్‌లోడ్ చేసినట్లు సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుర్తించాడు. ఈ విషయాన్ని తన బ్లాగ్‌లో రాశాడు. వినియోగదారుల అనుమతి లేకుండా డేటాను ఎలా సేకరిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే సెట్టింగ్స్‌లో డేటా సేకరణను నిలువరించడానికి ఆప్షన్ ఉందని వన్‌ప్లస్ ఉచిత సలహాలివ్వడం ఇక్కడ కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china phone  personal information  OnePlus  OxygenOS  Chris Moore  security researcher  

Other Articles

 • Sonia gandhi retires ahead of rahul gandhi takeover as congress president

  రాజకీయాలకు.. కాంగ్రెస్ కు ‘‘అమ్మ రాజీనామా..’’

  Dec 15 | రాజకీయాల నుంచి అమ్మ రాజీనామా చేశారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల పాలిట దశాబ్దాలుగా వున్న కలను సాకారం చేసిన పెద్దమ్మ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన రాజకీయ జీవితానికి స్వస్తి... Read more

 • Get ready jallikattu premier league in chennai from january 7

  సంక్రాంత్రి కన్నా ముందుగానే సంప్రదాయ పోటీలు..

  Dec 15 | ప్రజలతో ముడిపడిన సంప్రదాయ అచారం కన్నా ఏ చట్టం, శాసనం ఎక్కువకాదని తమిళనాడు వాసులు మరోమారు రుజువుచేశారు. దీంతో మూగజీవాలను క్రూరంగా హింసిస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో అంక్షల నడుమ అక్కడక్కడా.. నిర్వహించబడిన జల్లికట్టు.. గత... Read more

 • Supreme court extends all aadhaar linking deadlines to march 31

  సర్వోన్నత న్యాయస్థానం లింకింగ్ సమయాన్ని పోడిగించిందోచ్..!

  Dec 15 | దేశపౌరులలో నెలకొన్న అందోళనను ఎట్టకేలకు అర్థం చేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెసలుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలతోపాటు, ఇతర సేవలకోసం ఆధార్ లింకింగ్ ను తప్పనిసరి చేసిన క్రమంలో సుప్రీంకోర్టు... Read more

 • Police conducts medical test to rajesh after arrest

  సుధాకర్ హత్యస్థలానికి రాజేష్.. వాడిని చంపేయండీ..

  Dec 15 | తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో అతని భార్య స్వాతిని ఇటీవలే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ముఖానికి గాయాలు కావడంతో క్రితం రోజులన అమె ప్రియుడు రాజేష్ ను అదుపులోకి... Read more

 • Collector signature forgery case journo arrested

  మరదలికి ఏఎన్ఎం ఉద్యోగం.. విలేకరి అరెస్టు

  Dec 15 | అతనోక న్యూస్ ఛానెల్ కు విలేకరిగా వ్యవహరిస్తున్నాడు. ఏకంగా కలెక్టర్ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నాడు. ఎవరైనా, ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే వాటిని రికార్డ్ చేసి.. అక్రమాలు జరుగతున్నాయని ప్రజలకు తన న్యూస్ ఛానెల్ ద్వారా... Read more

Today on Telugu Wishesh