Bharti Airtel counters Reliance Jio జియో ఎయిర్ టెల్ మధ్య ఆఫర్ల ఫోటీ..

Bharti airtel counters reliance jio offers new rs 999 postpaid plan

airtel 999 postpaid plan, airtel 50gb data plan, airtel big data unlimited calls, airtel new plan, airtel postpaid plans, airtel rs. 999 plan, jio, jio dhan dhana dhan, 100 percent cashback offer, reliance jio, latest news

Airtel has a new myPlan Infinity postpaid plan that provides customers with 50GB of bundled data and unlimited calls as jio announced 100% cash back offer on diwali dhan dhana dhan offer

దీవాళి ఆఫర్లు.. జియో ‘ధన్ దనా ధన్’.. ఎయిర్ టెల్ ‘భారీ డేటా’..

Posted: 10/12/2017 12:41 PM IST
Bharti airtel counters reliance jio offers new rs 999 postpaid plan

జియో మరో సంచలన ఆఫర్‌తో ముందుకొచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం తీసుకువచ్చిన ఆపర్ ను మళ్లీ ఈ దీపావళి పండుగను పురష్కరించుకుని ‘దివాళి ధన్ ధనా ధన్’ ఆఫర్ తన కస్టమర్లకు ప్రకటించింది. దీనిలో భాగంగా జియో వినియోగదారులు ఈనెల 12 నుంచి 18 వరకు రూ. 399తో రిచార్జ్ చేసుకుంటే 100% క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చని తెలిపింది. రిచార్జ్ చేసుకున్న వెంటనే వారికి రూ. 50 విలువ గల ఎనిమిది ఓచర్లు క్రెడిట్ అవుతాయని, వాటిని భవిష్యత్‌లో రిచార్జ్ చేసుకునే సమయంలో వాడుకుని మొత్తం రూ. 400 క్యాష్ బ్యాక్ పొందవచ్చని వివరించింది.

ఈ వోచర్లను రూ.309 ఆపై విలువ గల ప్లాన్లు, రూ. 91 ఆపైన విలువ గల డాటా ప్లాన్లకు మాత్రమే వినియోగించాలన్న నిబంధన కూడా వుంది. ఒక రిచార్జ్‌కు ఒక ఓచర్‌నే ఉపయోగించాలి. అయితే నవంబర్ 15 తర్వాత మాత్రమే ఈ ఓచర్లను వినియోగించాలని సంస్థ కండీషన్ పెట్టింది. వీటిని ఎలా ఉపయోగించాలంటే.. రూ. 399 రిచార్జ్ చేసుకునే సమయంలో ఒక ఓచర్ వినియోగించుకుంటే రూ. 349 చెల్లిస్తే సరిపోతుందన్నమాట. ప్లాన్ వ్యాలిడిటీ అయిపోకపోయినా ఈ రిచార్జ్ చేసుకుంటే.. యాక్టివేట్ అవుతుంది.

ఇలా జియో అఫర్ ప్రకటించగానే అటు టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్ టెల్ కూడా కొత్త ప్రకటనతో జియోకు కౌంటర్‌ ఇస్తోంది. నిన్ననే తొలిసారి 4జీ యూజర్ల కోసం రూ.1,399తో ఆండ్రాయిడ్‌ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన ఎయిర్ టెల్, తాజాగా మరో కొత్త ప్లాన్ ను ప్రకటించింది. తన పోస్టుపెయిడ్ యూజర్ల కోసం కొత్త మైప్లాన్ ఇన్ ఫినిటీ పోస్టు పెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 50జీబీ డేటా, అపరిమిత కాల్స్ ను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. వినియోగించని డేటాను వచ్చే బిల్లింగ్‌ సైకిల్‌కు పంపించుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles