Sushma Swaraj comes to aid of tortured Indian భారతనారీ ఆర్తనాదంపై స్పందించిన సుష్మాస్వరాజ్

Punjabi woman requesting aap mp for help from saudi

saudi arabia woman, saudi arabia woman video, saudi arabia woman torture, Bhagwant Mann, AAP MP, Saudi arabia, punjabi woman, Requests Help, Sushma swaraj, youtube, video viral, viral video, latest news

External affairs minister Sushma Swaraj has asked the Indian Embassy in Riyadh to respond to a video of a woman from Punjab in which she alleges torture by her employers in Saudi Arabia

సౌదీ నరకప్రాయం.. భారతనారీ ఆర్తనాదం.. సుష్మా సాయం

Posted: 10/12/2017 10:53 AM IST
Punjabi woman requesting aap mp for help from saudi

ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కేందుకు దేశం కానీ దేశానికి వలసవెళ్లిన మనదేశ మహిళకు అక్కడ ఏడాది కాలంగా నరకాన్ని అనుభవిస్తుంది. భవిష్యత్తుపై కోటి ఆశలతో తాను కష్టపడినా.. తన కుటుంబసభ్యులు సంతోషం కోసం భాధలకు సిద్దపడి వెళ్లిన మహిళ.. అక్కడ ఎదురైన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తనను ఎవరైనా, ఎలాగైనా రక్షించండంటూ అర్తిగా అర్థిస్తూ.. అపన్నహస్తం కోసం ఎదురుచూస్తుంది. కాగా ఈ భారత నారీ వ్యధను తన దయార్థహృదయంలో అర్థం చేసుకున్న కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెనువెంటనే స్పందించారు.

సౌదీ అరేబియాలోని భారత విదేశాంగ శాఖ అధికారులకు బాధిత మహిళను అదుకుని భారత్ పంపించాల్సిందిగా అదేశించారు. అమె అక్కడ ఎలాంటి నరకం అనుభవిస్తుందో తెలుసుకుని అందుకు బాధ్యులైన వారిపై అక్కడి చట్టం ప్రకారం కేసులు నమోదుచేయించాల్సిందిగా కూడా సుష్మాస్వరాజ్ అదేశాలను జారీ చేశారు. పంజాబ్ కు చెందిన మహిళ అర్తిగా సాయంకోసం అర్థిస్తూ సోషల్ మీడియా వేదకగా పెట్టిన పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది. పంజాబ్ కు చెందిన అప్ ఎంపీ భగవంత్ మన్ ను సాయం కొరుతూ ఈ ఫోస్టు పెట్టింది.

వివరాల్లోకి వెళ్తే... పంజాబ్‌ లోని దవాడ్మీ సిటీకి చెందిన వివాహితను (22) ఓ వృద్ధురాలి బాగోగులు చూడాలనే ఒప్పందంపై సౌదీ తీసుకెళ్లారు. ఇక అక్కడికి వెళ్లిన సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. తాను పున్నామ నరకంలో అడుగుపెట్టానని అక్కడికి వెళ్లిగానీ తెలుసుకోలేకపోయింది. చిత్రహింసలు తాళలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లినా.. మళ్లీ అక్కడికే తీసుకువచ్చి అప్పగించారు. దీంతో ఇక చేసేది లేల అమె తనను రక్షించాలని వేడుకుంటూ సంగూర్ నియోజకవర్గ ఎంపీ భగవంత్ మాన్ సహాయం కోరుతూ ఒక వీడియోను పోస్టు చేసింది.ఈ విడియోలో తన బాధను వ్యక్తం చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెట్ జనులు తమదైన శైలిలో స్పందించారు. అర్తిగా అడుగుతున్న మహిళ దీనస్థితిని అర్థం చేసుకోకుండా రాజకీయాలకు స్థానం కల్పించారు. భగవంత్ మన్ ఏం చేయలేరని, సుష్మాస్వరాజ్ ను అశ్రయించాలని సూచనలు చేశారు. అదే సూచించడానికి బదులు తమ వంతుగా వారే ఈ లింక్ ను కేంద్రమంత్రి ట్విట్టర్ అకౌంట్ లో వేసివుంటే ఎంత బాగుండు. కానీ అలా చేయలేదు.

చివరకు ఓ నెట్ జనుడు మాత్రం అదేపనిచేసి అమెకు సత్వరంగా సాయాన్ని అందించాలని కేంద్రమంత్రిని కోరాడు. దీనిపై మెరుపు వేగంతో స్పందించిన కేంద్రమంత్రి సుష్మా.. సౌదీలోని భారత విదేశాంగ శాఖ అధికారులకు వివరాలు పంపించి బాధిత మహిళకు వేగంగా సాయాన్ని అందించాలని అదేశించింది. దీంతో మరికొన్ని రోజుల్లో పంజాబీ మహిళ కథ సుఖాంతం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saudi arabia  punjabi woman  Requests Help  Sushma swaraj  youtube  video viral  viral video  

Other Articles

 • Rahul s hug everyone must maintain parliamentary decorum says speaker

  రాహుల్ జీ.. ఏమిటిదీ.? సభా గౌరవం ఏదీ.?

  Jul 20 | లోక్ సభలో అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రకంపనలు సృష్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు పట్ల స్పీకర్ సుమిత్రా మహజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఆయన... Read more

 • Lalit modi nirav modi bade modi looting india says trinamool leader

  మోదీ త్రయం దేశానికి శాపం.. దోచేస్తున్నారన్న టీఎంసీ

  Jul 20 | కేంద్రంపై విశ్వాసం లేదనడానికి నిదర్శనమే టీడీపీ అవిశ్వాస తీర్మానమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్ విమర్శించారు. ప్రభుత్వంలోకి రాకముందు నుంచి మైత్రిని కొనసాగిస్తూ వచ్చిన మిత్రపక్ష పార్టీ.. నాలుగేళ్లు అధికారంలో వున్న... Read more

 • Waitress thrashes man for sexually assault in restaurant

  ITEMVIDEOS: తాకరాని చోట చేయ్యేస్తే.. తాట తీసింది..

  Jul 20 | తన పనుల్లో తాను నిమగ్నమై వుండగా, ఓ వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి జారుకుంటున్న నేపథ్యంలో అతడికి ఎదురొడ్డి నిలచి అటాకాయించి బుద్దిచెప్పిన మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలను అందుకుంటుంది.... Read more

 • Rahul gives jadoo ki jhappi to pm after a fiery session and winks to his mps

  పార్లమెంటులో ప్రధానికి రాహుల్ ‘‘జాదూకా జప్పీ’’..

  Jul 20 | అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఎవరూ ఊహించని ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై తన ప్రసంగంలో రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతూ, ఓ వైపు నీతివంతమైన పాలన... Read more

 • Bjp s rakesh singh speaks in lok sabha on no confidence motion

  అవిశ్వాస చర్చ: రాఫెల్ ప్రకంపనలు సృష్టించిన రాహుల్ గాంధీ

  Jul 20 | గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ.. ఇవాళ తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో ఆయనకు తగినంత సమయం లభిస్తుంది.. అయనెలా భూ ప్రకంపనలను సృష్టిస్తారన్నది... Read more

Today on Telugu Wishesh