Government lost high moral ground after defending Jay Shah case అవినీతిపై బీజేపి యుద్దం ఇదేనా.. నిలదీసిన యశ్వంత్ సిన్హా

Yashwant sinha alleges many bjp lapses in handling jay shah case

Yashwant Sinha, Amit Shah’s son Jay Shah, Jay Shah, Amit Shah, Former finance minister Yashwant Sinha, Jaswant Sinha, BJP president Amit Shah, Narendra Modi, PM Narendra Modi

Former finance minister Yashwant Sinha said, ‘The very special circumstances in which the Additional Solicitor General has been cleared to defend the concerned person also raises some issues and that was also to my mind avoidable’.

అవినీతిపై బీజేపి యుద్దం ఇదేనా.. నిలదీసిన యశ్వంత్ సిన్హా

Posted: 10/12/2017 10:16 AM IST
Yashwant sinha alleges many bjp lapses in handling jay shah case

ఎలుకలున్నాయని గుడిసెలను తగులబెడ్డినట్లు పెద్దనోట్ల రద్దు నిర్ణయం వుందని, జీఎస్టీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందంటూ బీజేపి పార్టీకి కొరకరాని కొయ్యగా మారిని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు సొంత పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. కేంద్రంలోని సొంతపార్టీ తప్పుడు నిర్ణయాలను ఎత్తిచూపుతూ.. విఫక్ష నేతలకు అయుధంగా మారిన సీనియర్ నేత తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షాపై అవినీతి ఆరోపణలపై విమర్శలు గుప్పించారు.

ఈ ఆరోపణలతో బీజేపీకి ఉన్న నైతిక స్థాయిని కోల్పోయినట్టయిందన్నారు. అవినీతికి దూరంగా దేశాన్ని తీసుకువెళ్తున్నామని ప్రకటిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా.. జై షా కేసును వాదించేందుకు ప్రభుత్వ ఉన్నత న్యాయవాది తుషార్ మెహతాను రంగంలోకి దింపడాన్ని ఆయన తప్పుబట్టారు. జైషాకు విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ రుణం మంజూరు చేసిన విధానంపై కూడా విమర్శలు చేశారు.

పియూష్ గోయల్ జైషాను వెనకేసుకొస్తున్న తీరు చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్టు కనిపిస్తోందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. జై షా అవినీతి అరోపణల అంశమై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. కాగా, బీజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత జైషా ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయని ఆరోపిస్తూ ‘ది వైర్’ అనే వెబ్ సైట్ లో ఓ కథనం వచ్చింది. దీనిని సవాల్ చేసిన జై షా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yashwant Sinha  amith shah  jay shah  bjp  PM Modi  

Other Articles