Vice-principal sexual assault on 40-yr-old teacher 40 ఏళ్ల టీచర్ పై వైస్ ప్రిన్సిపాల్ అత్యాచార యత్నం

Vice principal sexual assault on 40 yr old teacher

suresh pandurang, supriya gawde, Salonee Mistry, psi, Pandurang, gawde pandurang, CCTV, Manjri based teacher, school library, sexual assault on teacher, molestation on teacher, sexual harrasment on teacher, teacher vice principal, vice principal harrasment

Complainant claims that the accused would meet her only to make passes; an incident in school library prompted complaint

40 ఏళ్ల టీచర్ పై వైస్ ప్రిన్సిపాల్ అత్యాచార యత్నం

Posted: 10/11/2017 03:10 PM IST
Vice principal sexual assault on 40 yr old teacher

కామా తురానాం న భయం న లజ్జ అన్న నానుడి తనలో బాగా ఇముడ్చుకున్నాడేమో తెలియదు కానీ ఏకంగా రేపో మాపో పదవీ విరమణ చేసి.. కృష్ణా, రామా అంటూ ఇంట్లో కూర్చోవాల్సిన ఓ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్.. తన సహోద్యోగైన ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధించడమే కాకుండా ఏకంగా పాఠశాల గ్రంధాలయంలోకి పిలుపించుకుని అక్కడ ఎవరూ లేరని తెలుసుకుని అమెపై అత్యాచారయత్నానికి కూడా తెగబడ్డాడు.

ఈ ఘటన పూణే నగరంలోని మంజ్రీ ఉన్నత పాఠశాలలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. సురేష్ పాండురంగ్ (58) అనే వ్యక్తి మంజ్రీలోని ఓ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో ఉప ప్రధానోపాధ్యాయుడు.. అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న 40 ఏళ్ల మహిళను పాండురంగ గత మూడు మాసాలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తూ.. అమెను నిత్యం తాకడానికి యత్నించేవాడు. పెద్దవాడు అందులోనూ వైస్ ప్రిన్సిపాల్ అని అమె కొంత దూరంగా వుంటూ వచ్చింది.

అయితే సరిగ్గా పక్షం రోజుల క్రితం పని వుందంటూ అమెను గ్రంథాలయానికి పిలిపించుకున్నాడు. అమె లోనికి వెళ్లగానే అమెను తన కబంధ హస్తాలతో బంధించి.. వెళ్లనీయకుండా చేశాడు. దీంతో ఆమె బలాన్ని కూడగట్టుకుని అతడ్ని తోసేసి బయటకు పరుగులు తీసింది. భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే ముబావంగా వుంటున్న భార్యను గమనించిన భర్త పదేపదే కొరడంతో ఎట్టకేలకు విషయాన్ని చెప్పింది. దీంతో పోలీసులకు పిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి వైప్ ప్రిన్సిపాల్ ను కటకటాల వెనక్కి పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles