Sarath Kumar told to move SC పాత నోట్ల పంచాయితీ.. కోర్టును ఆశ్రయించిన హీరో..

Set back to actor in old currency notes issue get clarification from sc

madras HC, madras high court, supreme court, R Sarath Kumar, Rajiv Shakder, N Sathishkumar, Chief Electoral Officer, M Duraiswamy, assembly polls

The High Court suggested actor Sarath Kumar to get clarification from the Supreme Court on return of his seized money during the previous assembly polls as it also involves demonetised currency.

పాత నోట్ల పంచాయితీ.. సుప్రీంను ఆశ్రయించిన హీరో..

Posted: 10/11/2017 12:35 PM IST
Set back to actor in old currency notes issue get clarification from sc

పాత నోట్ల పంచాయితీపై ఓ ప్రముఖ నటుడు, రాజకీయ నేతను న్యాయస్థానం మెట్లు ఎక్కించేలా చేస్తుంది. అయితే ఇక్కడ ఈ సలహా ఇచ్చింది కూడా ఓ న్యాయస్థానం కావడమే గమనర్హాం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఇంటి నుంచి బయలుదేరుతున్న క్రమంలో ఎన్నికల అదికారులు అకస్మాత్తుగా వచ్చి తన కారులోని రూ. 9లక్షలను స్వాధీనం చేసుకున్న ఘటనపై  హీరో, సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు శరత్‌ కుమార్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. తన నుంచి ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న అక్షరాల రూ.9లక్షలకు తగిన లెక్కలు చూపడంతో వాటిని ఈసీ అధికారులు తిరిగి చెల్లించనున్నారు.

ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. స్వాధీనం చేసుకన్న క్రమంలో అప్పటి పాత కరెన్సీలోని రూ.500, రూ.1000 నో్ట్లనే ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటినే తిరిగి ఇచ్చేస్తామని చెప్పడంతో.. తనకు ఆ నోట్లు ఇచ్చినంత మాత్రన లాభం ఏంటీ.. ఏలా తాను పాట నోట్లను తీసుకునేది అని ప్రశ్నించిన శరత్ కుమార్.. ఏకంగా న్యాయస్థానాన్ని అశ్రయించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో లేదా డీడీ రూపంలో ఇవ్వాలని ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి ఎం.దురైస్వామి విచారణ జరిపి.. శరత్‌ కుమార్‌ కోరుతున్నట్టుగా చెక్కు లేదా డీడీ రూపంలో ఇవ్వడం కుదరదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. కాగా పాత కరెన్సీ నోట్లకు సంబంధించి ఎలాంటి పిటిషన్ దాఖలైన దాన్ని విచారణకు స్వీకరించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు కోనసాగుతున్న నేపథ్యంలో తాము ఈ పిటీషన్ ను విచారించలేమని మద్రాసు రాష్టోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి దురైస్వామి పిటీషన్ ను తోసిపుచ్చారు.
 
సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లిన శరత్ కుమార్ కు అక్కడా చుక్కెదురైంది. ఈ పిటిషన్ ను విచారిచిన న్యాయమూర్తులు రాజీవ్‌ సుందర్‌, ఎన్‌.సతీష్‌ కుమార్ లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. కాగా, నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు ఈ కేసుపై విచారణ చేపట్టలేమనీ, కానీ, ఒక సూచనచేస్తామని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సలహా ఇచ్చింది. మరి శరత్ కుమార్ సుప్రీం తలుపులు తట్టేనా..? అయనకు న్యాయం జరిగేనా..? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles