Siri Chandana Kidnap Mystrey Closed | డాక్టర్ సిరి చందన కిడ్నాప్ కథ సుఖాంతం

Siri chandana kidnap case solved

House surgeon Siri Chandana, Siri Chandana Kidnap, Siri Chandana Episode, Siri Chandana Attack, House surgeon Siri Chandana Parents, House surgeon Siri Chandana Husband, Siri Chandana case, Siri Chandana Naveen, Siri Chandana Revathi

Police Chased Siri Chandana Kidnap Case. Doctor Siri Chandana Kidnaped by her parents. Intercast Marriage is the issue in this case. Two days back House surgeon Siri Chandana attacked with Chilli Powder and Kidnapped.

సిరి చందన ఎపిసోడ్ సుఖాంతం

Posted: 10/11/2017 10:32 AM IST
Siri chandana kidnap case solved

హౌస్‌ సర్జన్‌ సిరిచందన కిడ్నాప్‌ ఎపిసోడ్ కు ఎట్టకేలకు తెరపడింది. సిరిచందనను భర్త నవీన్ కుమార్ కు పోలీసులు అప్పగించటంతో కథ సుఖాంతమైంది. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పెద్దలకు ఇష్టం లేకుడా ప్రేమించిన వ్యక్తిని ఆమె కులాంతర వివాహం చేసుకుంది.

పోలీసుల సమక్షంలో ఈ పంచాయితీ ఎంతకు తెగకపోవటం.. పైగా తాను భర్తే వద్దే ఉంటానని ఆమె చెప్పటం పేరెంట్స్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నాం సిరి చందన, ఆమె భర్త.. అతని సోదరిపై దాడి చేసి సిరిని కిడ్నాప్ చేయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకం రేపింది.


అసలేం జరిగింది..

చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ప్రభుత్వ రూరల్‌ హెల్త్‌ సెంటర్‌ హౌస్‌ సర్జన్‌ సిరిచందన, తిరుపతికి చెందిన నవీన్‌ కుమార్‌ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో గత ఆగస్టు 16న కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వారికి బెదిరింపులు ఆరంభమయ్యాయి. దీంతో వారిద్దరూ ఎస్పీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రెండు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ తీరు మార్చుకోని సిరిచందన తల్లిదండ్రులు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సిరిచందనను కిడ్నాప్ చేయించారు.

విధులు నిర్వహించి ఇంటికి వెళ్తున్న నవీన్‌ కుమార్‌, అతని సోదరి రేవతి, భార్య సిరిచందనను ఆమె తల్లిదండ్రులు తమ వర్గం సాయంతో దాడి చేశారు. తొండవాడ సమీపంలో అడ్డగించి, కళ్లలో కారం చల్లి దాడి చేశారు. స్థానికులు కల్పించుని అడ్డగించటంతో కేవలం సిరిచందనను తీసుకుని వెళ్లిపోయారు. దీంతో నవీన్ పోలీసులను ఆశ్రయించారు.

సిరి చందన తల్లిదండ్రులు రాజభూపాల్ రెడ్డి, పార్వతమ్మలపై అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు సిరిచందనను గుర్తించి భర్తకు అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Missing inter student sai prajwala safe in uppal

  సాయి ఇంట్లో ప్రజ్వలించిన దీపావళి.. ఉప్పల్ లోనే ఇంటర్ బాలిక

  Oct 20 | మెడికల్ ఎంట్రెస్ కోసం నీట్ పరీక్షల శిక్షణ పోందుతున్న విద్యార్థిని సాయి ప్రజ్వల ఇంట్లో ఈ దీపావళి నిజంగానే కొత్త శోభతో ప్రజ్వలించింది. నారాయణ కాలేజీలో విద్యార్థులపై సాగుతన్న మానసిక వేదన భరించలేక.. ఆ... Read more

 • Man thrashed forced to spit lick saliva as punishment

  అమానవీయం: ఇది మనుషుల చేసే పనియేనా..?

  Oct 20 | బీహార్ లో మరోమారు అటవిక న్యాయం యావత్ దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. మనిషన్నవాడు ఎవరూ చేయని తరహాలో అక్కడ ఓ నాయి బ్రహ్మణుడికి శిక్షన విధించిన వైనం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.... Read more

 • Gambling at marriott taskforces raids hotel 40 businessmen held

  మారియట్ లో మకాం వేసి.. ప్రముఖుల పాడు పని..

  Oct 20 | దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ.. లక్ష్మీ పూజ చేసుకుని.. ఇంట్లోని వారందిరితో కలసి స్వీట్లు పంచుకుని టపాసులు పేలుస్తుంటే.. నగరంలోని ప్రముఖుల మాత్రం తమ కార్యకలాపాలను పక్కనబెట్టి భారీస్థాయిలో జూదానికి తెరతీశారు. వినడానికి విచిత్రంగా... Read more

 • Police investigating alleged terror plot to kill cm

  సీఎం హత్యకు కుట్ర.. అకతాయి పనా..? లేక నిజమా..?

  Oct 18 | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని హత్యకు నిజంగానే ఉగ్రవాద మూకలు పథక రచన చేస్తున్నాయా.? అసలు అమెనే తమ టార్గెట్ గా ఎంచుకునేందుకు కారణమేంటి. అమెపై ఉగ్రవాదులు గురి ఎందుకు... Read more

 • Revanth reddy slams andhra pradesh tdp leaders

  ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ ఫైర్.. కాంగ్రెస్ తో కలిసే..

  Oct 18 | టీడీపీ పార్టీ కోసం తాను తుది వరకు పోరాడతానని చెప్పిన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి.. తెలంగాణలో టీడీపీ పార్టీయే కనుమరుగు అవుతున్నా ఇంకా అందులోనే కోనసాగుతూ.. తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం... Read more

Today on Telugu Wishesh