Naidu asks party leaders not to cross 'line of control' నేనేమి చేశాను నేరం.. నాకెందుకయ్యింది గాయం..

Naidu irked over td cadre s excitement over kcr s visit to ap

Chandrababu Naidu, Telugu Desam Party, Payyavula Keshav, K Chandrasekhar Rao, Anantapur, Paritala sriram, paritala sunitha, marriage, Reveanth reddy, Telangana telugudesam, Andhra Pradesh, Telangana, Politics

TDP President chandrababu found fault with the personal interaction of senior party leader Payyavula Keshav with KCR during the visit and observed that it had sent some negative message to people.

నేనేమి చేశాను నేరం.. నాకెందుకయ్యింది గాయం..

Posted: 10/11/2017 10:03 AM IST
Naidu irked over td cadre s excitement over kcr s visit to ap

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చంద్రులు పైకి ఒకరితో ఒకరు చాలా హుందాగా, చిరకాల మిత్రుల్లాగా కలసివున్నా.. వారి మధ్యమాత్రం కొల్డ్ వార్ నడుస్తూనే వుంటుందన్న విషయం మాత్రం ఇప్పటికే పలు సందర్భాలలో నిరూపితమైంది. అయితే వీరిద్దరూ చర్చించుకుంటే రాని మనస్పర్ధలు పార్టీకి చెందిన నేతలు వారితో ఏకంగా జరిపితే మాత్రం వస్తాయని.. ఈ విషయంలో పార్టీకి కంకణబద్దుడా..? సినియర్ నేత..? లేక ఫిరాయింపుదారుడా..? అన్న వ్యత్యాసం కూడా ఏమీ వుండదని తెలుస్తుంది.

ఇందుకు పరిటాల శ్రీరామ్ వివాహం వేదికగా నిలిచింది. ఈ వివాహానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్.. టీడీపీ సీనియర్ నేత పయ్యావులతో కాసేపు ఏకాంతంగా మాట్లాడాటం ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో పయ్యావులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్సహాన్ని వ్యక్తం చేయడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. తానెం చేయకపోయినా.. తాను నేరం చేసిన వాడిలా ఉండాల్సి వచ్చిందని.. దీంతో తన మనస్సుకు గాయమైందని ఆయన కలత చెందారు.

కేసీఆర్ తో చర్చ విషయంలో ఈ విషయంలో చంద్రబాబుకు తప్పుడు సమాచారం అందించారని దీంతోనే తాను మాటలు పడాల్సి వచ్చిందని ఆయన సన్నిహిత నేతల వద్ద వాపోయినట్లు సమాచారం. పరిటాల శ్రీరామ్ పెళ్లిలో కేసీఆర్ కనిపిస్తే, మర్యాదపూర్వకంగా నమస్కారం పెట్టి వెళ్లిపోగా.. ఓ అధికారితో తనను ప్రత్యేకంగా పిలిపించారని, దీంతోనే తాను కేసీఆర్ వద్దకు మళ్లి వెళ్లాలని చెప్పారు. అయితే కేసీఆర్ తన చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి మరీ ఏకాంతంగా మాట్లాడితే.. తానెలా కాదనగలనని ప్రశ్నించారు.

చెయ్యని తప్పుకు మాటపడటం బాధను కలిగించిందని వాపోయిన పయ్యావుల.. తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుకు తనపై తప్పుడు సమాచారం అందించడం వల్లే తన మనస్సు గాయపడిందని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని తెలుస్తుంది. ఈ విషయంలో జరిగిందేంటో అధినేత తనను అడిగివుంటే బాగుండేదని కూడా అయన వాపోయారట. కాగా, రేవంత్ రెడ్డి, ఎల్ రమణలు.. చంద్రబాబుతో సమావేశమై, కేసీఆర్, పయ్యావుల ఏకాంత చర్చలను ప్రస్తావించారని సమాచారం. ఈ తరహా చర్యల ద్వారా కింద స్థాయిలో కార్యకర్తలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వారు పేర్కొనడంతో పయ్యవులను చంద్రబాబు హర్ట్ చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Payyavula Keshav  K Chandrasekhar Rao  Anantapur  paritala sunitha  Politics  

Other Articles