India set victory target of 119 runs for Australia కంగారెత్తిన విరాట్ సేన.. అసీస్ ముంగిట స్వల్ప లక్ష్యం

2nd t20 india set victory target of 119 runs for australia

cricket score, india vs australia, india vs australia 2017, india vs australia, india vs australia 2nd t20, ind vs aus, ind vs aus odi, india vs australia odi score, india vs australia match, india vs australia cricket score, guwahati t20 match, cricket

India set victory target of 119 runs for Australia in 2nd Twenty20 International match in Guwahati

కంగారెత్తిన విరాట్ సేన.. అసీస్ ముంగిట స్వల్ప లక్ష్యం

Posted: 10/10/2017 08:16 PM IST
2nd t20 india set victory target of 119 runs for australia

టీమిండియాతో గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించారు. భారత్ టాప్ అర్డర్ ను స్వల్ప పరుగులకే కుప్పకూల్చారు. దీంతో అసిస్ ఎదుట భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశించడంలో విరాట్ సేన విఫలమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణయ ఓవర్లలో 118 పరుగుల వద్ద అలౌట్ అయ్యింది. తొలి టీ20లో రాణించిన టీమిండియాను.. రెండో టీ20లో దెబ్బతీసింది మాత్రం ఆస్ట్రేలియా లెఫ్ట్ హ్యండ్ పేసర్ జేసన్ బెహ్రన్‌డార్ఫ్‌.

తాను వేసిన నాలుగు ఓవర్లలో నాలుగు కీలక వికెట్లు తీసి టీమిండియా టాప్‌ ఆర్డర్‌ నడ్డివిరిచాడు.  ఈ ఎడమచేతి వాటం పేసర్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను అంచనా వేయడంలో భారత బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. అతడితో పాటు అడమ్ జంపా కూడా తొడవ్వడంతో విరాట్ సేన కోలుకోలేకపోయింది. టీమిండియాలో కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్య కుల్దీప్ యాదవ్ మినహా ఎవరూ రాణించలేకపోయారు.

దీంతో 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే విరాట్ సేన చేసింది. టీమిండియా అటగాళ్లలో జాదవ్(27), పాండ్యా(25) అత్యధిక పరుగులు చేశారు. అయితే చివర్లో కుల్దీప్ యాదవ్ కూడా మెల్లిగా స్కోరుబోర్డును ముందుకు జరిపి కనీసం గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై పెట్టేందుకు దోహదపడ్డాడు. ఆసీస్ బౌలర్లలో పేసర్ జాసన్ బెహ్రెన్ డార్ఫ్ నాలుగు వికెట్లతో రాణించగా, స్పిన్నర్ ఆడమ్ జంపా రెండు వికెట్లు తీశాడు. కౌల్టర్ నైల్, స్టోనిస్, ఆండ్రూ టైలు తలో వికెట్ తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  guwahati  Team India  Australia  T20 match  cricket  

Other Articles