hanuman junction si sexually harasses married woman ఈ ఎస్ఐ చాలా చెడ్డోడు.. లైంగిక వేధింపులు..

Hanuman junction si sexually harasses married woman

sexual harassment, Married woman, beautician, si vijay kumar, hanuman junction, amaravathi, andhra pradesh, crime news, breaking news, latest news, crime

hanuman junction si vijay kumar sexually harasses a married women in muzvid

ఈ ఎస్ఐ చాలా చెడ్డోడు.. లైంగిక వేధింపులు..

Posted: 10/10/2017 07:23 PM IST
Hanuman junction si sexually harasses married woman

ప్రజా రక్షకులుగా, విపత్కర పరిస్థితుల్లో వారు చూపుతున్న ధైర్యసాహషాల నేపథ్యంలో సమాజంలో వారికి పెద్దఎత్తున గౌరవమర్యాదలున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ గౌరవమర్యాదలు తమకే దక్కుతున్నాయని వ్యక్తిగతంగా భావించడం సమంజసంకాదు. ఇలా భావించిన కొందరు పోలీసులు తమ వృత్తికి కళంకం తీసుకురావడంతో పాటు.. వ్యక్తిగతంగా కూడా చాలా నష్టపోతారనడానికి ఇటీవల కాలంలో జరిగిన పలు ఘటనలు రుజువుచేస్తున్నాయి.

ప్రజలు వ్యక్తిగత విషయాలను కూడా చెప్పుకోవడంతో వారు సన్నిహితంగా మాట్లాడుతున్నారని భావించిన ఓ ఎస్ఐ తాజాగా వివాహిత మహిళను టార్గెట్ చేసి అమెను నిత్యం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. కృష్ణా జిల్లాలో హనుమాన్‌ జంక్షన్‌ ఎస్‌ఐ విజయకుమార్‌ నూజివీడుకు చెందిన ఒక బ్యూటీషియన్ తో నెరపిన వివాహేతర సంబంధం అధికారులకు తెలిసి.. విధులకు దూరంగా (సస్పెండ్‌) వున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నూజివీడుకు చెందిన ఒక ఎస్‌ఐ ఓ వివాహితను నిత్యం వేదిస్తున్నాడు.

తనను వేధించొద్దని మహిళ ఎంతగా ప్రాధేయపడినా.. ఎస్ఐ పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు తన బతుకు అల్లరిపాలు కావడం తనకు ఇష్టం లేదని, అలా జరిగితే తనకు అత్మహత్యే శరణ్యమని వేడుకున్నా ఆ కామాంధ ఎస్ఐ కనికరించలేదు. కుటుంబసభ్యులకు విషయాన్ని చెప్పిన వివాహిత.. వారి సాయంతో తనను గత కొద్ది రోజులుగా వేధిస్తున్న ఎస్ఐ తనతో జరిపిన సంభాషణలను రికార్డు చేసి జిల్లా ఎస్సీకి వాటిని అధారంగా ఇస్తూ ఫిర్యాదు చేసింది.

దీంతో ఎస్ఐని తన కార్యాలయానికి పిలిచిన జిల్లా ఎస్పీ.. అతడికి చివాట్లు పెట్టి.. సస్పెండ్ చేయాలా..? లేక సెలవుపై వెళ్లిపోతావా..? అని అడగడంతో సెలవుపై వెళ్తానని, మరెప్పుడు ఇలాంటి విషయాల్లో తలదూర్చనని హామి ఇచ్చినట్లు సమాచారం. జిల్లా ఎస్సీ కోసం మచిలీపట్నం వెళ్లిన ఎస్ఐ ఇక అటునుంచి అటే సెలవుపై వెళ్లారని తెలిసింది. అయితే బాధ్యతాయుతమైన ఎస్ఐ మహిళల పట్ల ఇంత అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తిస్తే కేసు నమోదు చేయకుండా ఎందుకు వదిలేశారన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. అదే సామాన్యులు ఇలాంటి నేరాలకు పాల్పడితే చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పే పోలీసులు తమవారి విషయంలో మాత్రం చట్టాన్ని చుట్టంగా మార్చేశారన్న విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sexual harassment  Married woman  beautician  si vijay kumar  hanuman junction  crime  

Other Articles

  • Dsp ravibabu surrendered in rowdy gedela raju s murder case

    రౌడీషీటర్ హత్యకేసులో లోంగిపోయిన డీఎస్సీ రవిబాబు..

    Oct 20 | ఒక తప్పు చేసినప్పుడే దానిని సరిదిద్దుకోవాలని.. కానీ దానిని దాచడానికి ప్రయత్నిస్తే అనేక తప్పులు తెలియకుండానే చేస్తామని ఇలానే మనుషులలో నేరప్రవృత్తి పెరుగుతుందని చట్టం మనకు అనేక ఘటనల ద్వారా ఉదహరిస్తుంది. ఈ విషయాలను... Read more

  • Missing inter student sai prajwala safe in uppal

    సాయి ఇంట్లో ప్రజ్వలించిన దీపావళి.. ఉప్పల్ లోనే ఇంటర్ బాలిక

    Oct 20 | మెడికల్ ఎంట్రెస్ కోసం నీట్ పరీక్షల శిక్షణ పోందుతున్న విద్యార్థిని సాయి ప్రజ్వల ఇంట్లో ఈ దీపావళి నిజంగానే కొత్త శోభతో ప్రజ్వలించింది. నారాయణ కాలేజీలో విద్యార్థులపై సాగుతన్న మానసిక వేదన భరించలేక.. ఆ... Read more

  • Man thrashed forced to spit lick saliva as punishment

    అమానవీయం: ఇది మనుషుల చేసే పనియేనా..?

    Oct 20 | బీహార్ లో మరోమారు అటవిక న్యాయం యావత్ దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. మనిషన్నవాడు ఎవరూ చేయని తరహాలో అక్కడ ఓ నాయి బ్రహ్మణుడికి శిక్షన విధించిన వైనం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.... Read more

  • Gambling at marriott taskforces raids hotel 40 businessmen held

    మారియట్ లో మకాం వేసి.. ప్రముఖుల పాడు పని..

    Oct 20 | దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ.. లక్ష్మీ పూజ చేసుకుని.. ఇంట్లోని వారందిరితో కలసి స్వీట్లు పంచుకుని టపాసులు పేలుస్తుంటే.. నగరంలోని ప్రముఖుల మాత్రం తమ కార్యకలాపాలను పక్కనబెట్టి భారీస్థాయిలో జూదానికి తెరతీశారు. వినడానికి విచిత్రంగా... Read more

  • Police investigating alleged terror plot to kill cm

    సీఎం హత్యకు కుట్ర.. అకతాయి పనా..? లేక నిజమా..?

    Oct 18 | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని హత్యకు నిజంగానే ఉగ్రవాద మూకలు పథక రచన చేస్తున్నాయా.? అసలు అమెనే తమ టార్గెట్ గా ఎంచుకునేందుకు కారణమేంటి. అమెపై ఉగ్రవాదులు గురి ఎందుకు... Read more

Today on Telugu Wishesh