KA Paul Ordered To Handover GUM Properties ప్రభోధకా.. ఢిఫ్యూటీ కలెక్టర్ చెప్పింది చేసేవా

Ka paul ordered to handover gum properties esther rani

KA Paul Ordered To Handover GUM Properties, esteru rani, KA Paul Brother's Wife, Paul Ordered To Handover GUM Properties, KA Paul, notices, GUM Properties, Brother’s Wife, late brothers Wife, Order, Tahasildar, visakhapatnam, andhra pradesh

Vishaka rural Tahasildar shocks a Christian preacher KA Paul by serving notices to him and orders to handover gum society assets to Murdered Brother’s Wife esteru rani.

ప్రభోధకా.. ఢిఫ్యూటీ కలెక్టర్ చెప్పింది చేసేవా..?

Posted: 10/10/2017 06:32 PM IST
Ka paul ordered to handover gum properties esther rani

ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడిగా కన్నా సంచలన విషయాలను తనతోనే సాధ్యమన్న వాఖ్యలతో ప్రజలకు సుపరిచితుడైన కిల్లారి అనంద్ పాల్ (కేఏ పాల్) కు విశాఖపట్నం అర్బన్ ఢిఫ్యూటీ కలెక్టర్ షాక్ ఇచ్చారు. కేఏ పాల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న గమ్ (గోసెల్స్ టు అన్ రీచర్డ్ మిలియన్స్) సొసైటీకీ సంబంధించిన ఆస్తులను హత్యాగావించబడిన ఆయన సోదరుడు డేవిడ్ రాజు భార్య ఎస్తేరు రాణికి అప్పగించాలంటూ తహసీల్దార్ నాగభూషణం నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఇరు పార్టీలకు నోటీసులు ఇచ్చారు.

గమ్ సొసైటీకి వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులకు సంబంధించి అన్నదమ్ములు ఇద్దరి మధ్య వివాదం నడిచింది. ఈ నేపథ్యంలో, డేవిడ్ రాజు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆస్తుల కోసం డేవిడ్ రాజు భార్య, ఆయన కుమారులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే, ఈ ఆస్తులన్నీ కేఏ పాల్ కే చెందుతాయని, వాటిని ఆయనకే అప్పగించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. దీంతో, ఈ ఏడాది మే 16న గమ్ సొసైటీ ఆస్తులను కేఏ పాల్ కు అప్పగించారు.

దీన్ని సవాల్ చేస్తూ డేవిడ్ రాజు భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లో విశాఖ ఆర్డీవో కేఏ పాల్ కు నోటీసులు జారీ చేశారు.  కేఏ పాల్ తన అధీనంలో ఉన్న ఆస్తులను అర్బన్ తహసీల్తార్ స్వాధీనం చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ ఆస్తులను ఎస్తేరు రాణీకి అప్పగించవలసి ఉందని  ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు  ఆస్తులను అప్పగించాలని నోటీసులో  పేర్కొన్నారు. మరి కేఏ పాల్ అస్తులను రాణికి అప్పగిస్తారా..? లేదా..? అన్నది ఉత్కంఠకరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles