Police officer shot dead at Texas university అమెరికాలో విశ్వవిద్యాలయంలో కాల్పుల కలకలం..

Texas university campus in lockdown after police officer shot dead

texas tech university school, texas tech university, us shooting, us university shooting, us shooting, texas shooting, united states shooting, texas university shooting, american university shooting, world news, breaking news, latest news

A POLICE officer has been killed at Texas Tech University, a little over a year after the school legalised Senate Bill 11 — a controversial law that allows students, with a license to carry, to carry guns into buildings on campus.

అమెరికాలో విశ్వవిద్యాలయంలో కాల్పుల కలకలం..

Posted: 10/10/2017 10:26 AM IST
Texas university campus in lockdown after police officer shot dead

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. టెక్సాస్ నగరంలోని టెక్ యూనివర్శిటీలో ఓ విద్యార్ధి తనను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారిపై కాల్పులకు తెడబడటంతో.. పోలీస్‌ అధికారి మృతిచెందారు. అయితే ఇది డ్రగ్ మాఫియా చేసిన హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. విశ్వవిద్యాలయంలోకి డ్రగ్స్ తీసుకువచ్చి.. అక్కడి విద్యార్థులకు విక్రయిస్తూ.. సోమ్ముచేసుకోవడంతో పాటు విద్యార్థులకు డ్రగ్స్ ను అలవాడు చేస్తున్న ముఠాకు చెందిన ఓ విద్యార్థే అ హత్య చేసినట్టు అధికారులు భావిస్తున్నారు.

యూనివర్శిటీకి చెందిన అధికారుల విడుదల చేసిన ప్రకటన మేరకు వివరాలిలా వున్నాయి. యూనివర్శిటీ క్యాంపస్ లో డ్రగ్స్‌ మాఫియా జడలు విప్పుతుందన్న సమాచారంతో నిన్న రాత్రి విద్యార్థులకు చెందిన హాస్టల్ గదుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. విశ్వవిద్యాలయం అవరణలోని పోలీసుల సాయంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని గదిలో తనిఖీ చేయగా, డ్రగ్స్ బయటపడ్డాయి.

దీంతో అతడ్నిఅరెస్టు చేసిన పోలిస్ స్టేషన్ కు తరలిస్తుండగా, దుండగుడు తుపాకీ బయటకు తీసి పోలీస్‌ అధికారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ అధికారి అక్కడికక్కడే మృతిచెందారు. కాల్పుల అనంతరం దుండగుడు పారిపోయాడు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటన నేపథ్యంలో యూనివర్శిటీని మూసివేశారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. దుండగుడి వివరాలు తెలియరాలేదు. యూనివర్శిటీలోకి విద్యార్థులు తమ లైసెన్సు తుపాకులను తీసుకురావచ్చని గత ఏడాది అగస్టు 1న ప్రవేశపెట్టిన నూతన బిల్లుతో చట్టం అమల్లోకి వచ్చిన తరువాత చోటుచేసుకున్న తొలి ఘటన ఇది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles