Las Vegas Shooter Stephen C. Paddock details traced లాస్ వెగాస్ ఘటనలో.. వయోవృద్దుడే నరహంతకుడా..?

Las vegas shooter stephen c paddock details traced

las vegas shooting, las vegas mass shooting, las vegas strip, mandalay bay, mandalay bay casino, las vegas, las vegas casino, las vegas news, us news, world news, latest news

Stephen C. Paddock is the shooter identified as the lone killer in the deadliest mass shooting in American history. After Paddock opened fire from a hotel room at the Mandalay Bay Resort & Casino, over 50 people were dead and over 400 victims were injured.

లాస్ వెగాస్ ఘటనలో.. వయోవృద్దుడే నరహంతకుడా..?

Posted: 10/03/2017 10:23 AM IST
Las vegas shooter stephen c paddock details traced

అగ్రారాజ్యంపై విరుచుకుపడతామని ఓ వైపు హెచ్చరికలు చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ.. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న లాస్‌ వెగాస్ ను టార్గెట్ గా చేసుకుని.. అక్కడి మాండలే బే రిసార్ట్ లో కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో హాజరైన అహుతులపై తూటాల వర్షం కురిపించి ఘటన అగ్రరాజ్యం చరిత్రలో ఇదే అత్యంత ఘోర మారణకాండ. ఏకంగా 58 మంది ప్రాణాలను బలితీసుకోగా, 515 మంది ఈ దారుణమారణకాండలో క్షతగాత్రులయ్యారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా వుంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది.

ప్రముఖ సంగీతకారుడు జేసన్ అల్డీన్ పాడుతున్న గీతాలకు వీక్షకులు లయబద్ధంగా ఆనందంగా స్టెప్పులేస్తూ సంతోషాంలో మునిగి తేలుతున్న క్రమంలో తూటాలు దూసుకొచ్చి అక్కడున్న వారి దేహాల్లోకి దూసుకెళ్లాయి. పది సెకన్ల పాటు విరామం లేకుండా భారీ ఎత్తున తూటాలు దూసుకొచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నేలపై పడినవారు నేలకు అంటుకుపోయేలా కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పది సెకన్ల అనంతరం కొన్ని సెకన్ల విరామం ఇచ్చి మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయని వారు తెలిపారు. దీంతో కాన్సర్ట్ చూసేందుకు వచ్చినవారు పరుగులు తీశారు.

ఈ నరమేధం సృష్టించిన స్టీఫెన్‌ క్రెయిగ్‌ పాడ్డాక్‌ (64) కు సంబంధించిన వివరాలన్నింటినీ అగ్రరాజ్యం పోలీసులు సేకరించారు. వయస్సు మీదపడి ఉద్యోగ విరమణ చేసిన అనంతరం కృష్ణా రామా అంటూ ఇంట్లో కూర్చోవాల్సిన వయోవృధ్దుడు ఈ దారుణమారణ కాండను సృష్టించడానికి గల కారణాలను కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు. మాండలే బే రిసార్ట్ కు ఈశాన్యంగా 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెస్‌ క్వీట్‌ లో పాడ్డాక్ నివాసముంటున్నాడు. ఇక్కడ రిటైర్ అయినవారు నివాసముండే ప్రాంతంలో అతను కూడా నివాసముండడం విశేషం. అతని మృతదేహం వద్ద లభించిన ఆధారాల ప్రకారం తనిఖీలు చేసిన పోలీసులు అతనికి ఎలాంటి నేరచరిత్ర లేదని నిర్ధారించారు. అయినా అతను ఈ మారణకాండకు ఎలా పూనుకున్నాడన్నదే పోలీసులకు అర్ధంకాని ప్రశ్న.

పాడ్డాక్ పాటు మారిలో డాన్లే అనే మహిళ కూడా ఉంటోందని, అయితే ఆమె ప్రస్తుతం ఫిలిప్పీన్స్ లో ఉంటుందని, ఆమెతో తాము మాట్లాడామని వెల్లడించిన పోలీసులు అతని గదిని పరిశీలించగా, భారీ ఎత్తున తుపాకులు, తూటాలు బయటపడ్డాయి. పాడ్డాక్ కు హంటింగ్, ఫిషింగ్, పైలట్ లైసెన్సులు ఉన్నాయని పోలీసులుతెలిపారు. అలాగే అతనికి రెండు చిన్నపాటి విమానాలు కూడా ఉన్నాయని తెలిపారు. 1980ల్లో లాక్‌ హీడ్‌ మార్టిన్‌ లో ఇంటర్నల్‌ ఆడిటర్‌ గా మూడేళ్లపాటు పనిచేసినట్టు గుర్తించారు. కాగా తమ సోదరుడికి ఎలాంలి మతతత్వ శక్తులతో సంబంధం లేదని ఉన్మాది సోదరుడు తెలిపాడు.

తన సోదరుడు చాలా మంచివాడని, లాస్ వెగాస్ లో జరిగిన మారణకాండకు తమ సోదరుడే కారణమంటే నమ్మలేకపోతున్నామని చెప్పాడు. ఈ మారణకాండ నేపథ్యంలో తమ నివాసానికి కొంత దూరంలో వుండే తమ తల్లి (90) అస్సలు నమ్మలేకపోతుందని అన్నారు. ఇక ఒక్కసారిగి తమకు తెలిసిన పిడుగులాంటి వార్తతో తాము భయకంపితులం అవతున్నామని, ఎక్కడా బాధితు బంధువులు తమపై దాడికి ప్రయత్నిస్తారోన్నన్న భయాందోళన తమలో నెలకోందని చెప్పాడు.

అయితే పాడ్డాక్ పై ఎలాంటి నేరచరిత్ర లేదని చెప్పిన పోలీసులు, అతని తండ్రి హాస్కిన్స్‌ బెంజమిన్‌ పాడ్డాక్‌ కరుడుగట్టిన దొంగ అని తెలిపారు. వరుస బ్యాంకు దొంగతనాలతో పోలీసు రికార్డులకెక్కాడని తెలిపారు. ఒక కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడి టెక్సాస్‌ కేంద్ర కారాగారంలో శిక్షననుభవించి, 1969లో జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడని వెల్లడించారు. వైద్యులు అతనిని సైకోపాత్ గా పేర్కొన్నారని, అతనికి ఆత్మహత్య చేసుకునేంత ఉన్మత్తత ఉందని తెలిపారని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Scr introduces magic box to make train journey a thrill

  రైలు ప్రయాణం.. మ్యాజిక్ బాక్స్ తో వినోదాత్మకం..

  Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు  ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్‌... Read more

 • Pawan kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol

  ‘‘థర్మం దారితప్పితే.. కన్యకా పరమేశ్వరే మార్గదర్శకం..’’

  Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more

 • Bjp operation lotus yeddurappa caught again in audio tapes

  ‘‘కర్ణాటకలో ప్రలోభాల పర్వం.. కాదేదీ రాజకీయ అనర్హం’’

  Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more

 • 12 crpf jawans killed many injured in jk terror attack

  పేట్రేగిపోయిన ముష్కరులు.. 12 మంది జవాన్ల మృతి.. కాశ్మీర్లో బీభత్సం..

  Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more

 • Sensational twist in coastal bank director chigurupati jayaram case

  జయరాం హత్యకేసులో సంచలన ట్విస్టు

  Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more

Today on Telugu Wishesh