LB Stadium set to soak in Bathukamma spirit today మహా బతుకమ్మకు ఏర్పాటు పూర్తి.. ట్రాఫిక్ అంక్షలు

Hyderabad gears up for maha bathukamma

bathukamma, ghmc, lb stadium, traffic diversions, maha bathukamma celebrations, GHMC, Telangana, guinness record, gunfoundry, himayatnagar, hyderabad, hyderabad news, kv ramanachary, lb stadium, maha bathukammma, medchal, nizam college, ntr stadium, public gardens, ranga reddy, sadhula bathukamma, latest news

Arrangements are in place for ‘Maha Bathukamma’, which will have over 30,000 women participating in a bid to set a new Guinness record at LB Stadium

ITEMVIDEOS: కన్నుల పండువగా మహా బతుకమ్మ

Posted: 09/26/2017 01:23 PM IST
Hyderabad gears up for maha bathukamma

దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణలో పట్టణాలు, పల్లెల్లో బతుకమ్మ సంబురాలను అడపడచులు సంబరంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ ఆట-పాటలతో ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు  ఇదే సందర్బంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మహా బతుకమ్మను నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ సంబురానికి రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. గతేడాది పది వేల మంది తెలంగాణ అడపడచులు బతుకమ్మ వేడుకలలో పాల్గొని విజయవంతం చేసిన విషయం పాఠకులకు విధితమే.

కాగా, ఈ సారి ఏకంగా 30 వేల నుంచి 35 వేల మంది తెలంగాణ అడపడచులతో పాటు వేడుకలలో పాల్గోనేందుకు ఉత్సాహం చూసే అడపడచులందరితో ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా  నిర్వహించానలి సంస్కృతిక శాఖ భావిస్తుంది. ఇందుకోసం మహా బతుకమ్మ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకు ఈ వేడుకలు జరుగనున్నాయి. ఇందుకోసం నగరంలోని మహిళలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా అడపడచులు ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు.

ఇక 28న సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని 3వేల మంది శిక్షణ పొందిన మహిళలతో గిన్నిస్ బతుకమ్మ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. తంగేడు పువ్వు ఆకారంలో బతుకమ్మ ఆడించేందుకు ఏర్పాట్లు చేశామంటోంది. సద్దుల రోజు సాయంత్రం 4నుంచి బతుకమ్మ ఆటాపాట… రాత్రి 8 నుంచి తొమ్మిదింటి వరకు  బాణసంచా కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, మహా బతుకమ్మ వేడుకల సందర్భంగా సిటీలోని ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bathukamma Festival  LB Stadium  Maha Bathukamma Celebrations 2017  GHMC  Telangana  

Other Articles