Australian Man faints, falls on to tracks as train comes in సృహతప్పి పట్టాలపైకి.. అదృష్టవంతుడు..

Australian man faints falls on to tracks as train comes in

sydney man, australian man, man faints and falls on railway tracks, wynyard railway station, australia railway station, viral videos, videos viral, latest news

A SYDNEY man had a very lucky escape after he fainted onto tracks at Wynyard Station as a train was heading towards him, this footage is viral on net now.

ITEMVIDEOS: సృహతప్పి పట్టాలపైకి.. అదృష్టవంతుడు..

Posted: 09/26/2017 12:01 PM IST
Australian man faints falls on to tracks as train comes in

అదృష్టమంటే ఇదే. అసలు అదృష్టవంతుడంటే కూడా ఇతడే. మనిషి జీవించినంతకాలం అర్థపర్థం లేని డబ్బు అస్తులు, నగ, నట్రా కోసం వెంపర్లాడుతుంటాడు. కానీ అదే ప్రాణాలపైకి వచ్చే సరికి అన్ని ఇస్తాను కానీ ప్రాణాలను కాపాడాలని అర్థిస్తాడు. అంటే నిజమైన సంపద భగవంతుడిచ్చిన ప్రాణాన్ని క్షేపంగా చూసుకోవడంతో పాటు దానిని సద్వినియోగం చేసుకోవడం కూడా అన్న తత్వం తెలిస్తే చాలు. ఇప్పుడీ విషయం ఎందుకంటే తనకెం జరిగిందో తెలియదు.. అయితే చూసేవాళ్లకు మాత్రం అయన ప్రాణం పోయిందనే భావించారు.

అప్పుడే తన తోటి ప్రయాణికులు సమయ స్ఫూర్తితో వ్యవహరించటంతో పాటు రైలు సిబ్బంది కూడా అప్రమత్తతతో వ్యవహరించడంతో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడి అదృష్టవంతుడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ పట్టణానికి చేరువలో గట విన్ యార్డ్‌ రైల్వే స్టేషన్ ఈ నెలారంభంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నా.. నిన్న రాత్రి ఇందుకు సంబంధించిన సిసిటీవీ ఫూటేజీ విడుదల కావడంతో.. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది కాస్తా వైరల్ అయ్యింది. ఇది చూసిన వారు అయన అదృష్టవంతుడేనని అంటున్నారు.

రైలు కోసం కొంత సమయం నుంచి ఎదురు చూస్తున్న ఓ సిడ్నికి చెందిన ప్రయాణికుడు తీరా రైలు స్టేషన్ కు చేరుకుంటున్న క్రమంలో ఉన్నట్లుండి సృహ కోల్పోయాడు. పక్కనున్న తోటి ప్రయాణికుడు అది గమనించి పట్టుకునే లోపు ఆ వ్యక్తి ముందుకు పడి ఏకంగా రైలు పట్టాలపై పడిపోయాడు. అయ్యే దేవుడా ఏం జరుగుతుంది అని తోటి ప్రయాణికుడు భావించే లోపు మిగిలిన ప్రయాణికులు అది గమనించి. రైలును అపే ప్రయత్నాలు చేశారు., మరికోందరు తమ ప్రాణాలకు తెగించి రైలు పట్టాలపైకి దూకి బాధిత వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నించారు.

ఇంతలో రైల్వే సిబ్బంది పరుగున వచ్చి జరిగిన విషయాన్ని గమనించి.. రైలును ముందుకు రానీయంకుండా చేతితో సైగలు చేసి.. అదే సమాచారాన్ని కంట్రోల్ రూంలో కూడా ఇచ్చేందుకు వెళ్లాడు. దీంతో రైలు ముందుకు రాకుండా అగిపోయింది. దీంతో ప్రయాణికులు బాధిత వ్యక్తిని పట్టాలపై నుంచి ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకువచ్చారు. ఆ తరువాత కొంత సేపటికి లేచిన బాధిత వ్యక్తి తనకేం జరిగిందో తెలియని అయోమక స్థితిలో వుండగా, అయనను రైల్వే అధికారులు అస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కాగా ఈ వీడియో వైరల్ కావడంతో వ్యక్తి ప్రాణానికి స్థానికులు ఇచ్చిన విలువను, తమ ప్రాణాలను సైతం లెక్కచేయని వైనాన్ని నెట్ జనులు అభినందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles