SC Unamused at Plea to Ban Mosquitoes సుప్రీంకోర్టే ఈ పని సాద్యం కాదంది.. ఎంటాపని.?

Abolish mosquitoes apex court reposes faith in supreme power

supreme court mosquitoes, supreme court god, Supreme Court, mosquitoes petition, abolish mosquitoes, Dhanesh Ieshdhan, mosquito-borne diseases, Justices Madan B Lokur, Deepak Gupta

The Supreme Court on Friday came across a plea and admitted that it was beyond its power to help the petitioner, who was aking authorities to "abolish" mosquitoes.

సుప్రీంకోర్టే ఈ పని సాద్యం కాదంది.. ఎంటాపని.?

Posted: 09/23/2017 06:42 PM IST
Abolish mosquitoes apex court reposes faith in supreme power

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టుకే ఒక్కోసారి కొన్ని సమస్యలను పరిష్కారం చెప్పడం సాధ్యం కాదు. అలాంటప్పుడే న్యాయస్థానం ఈ కేసుల్లో తీర్పులు చెప్పడానికి తాము దేవుళ్లం కాదు అని కూడా అనేస్తారు. అదేంటి అలాంటి కేసులు కూడా వస్తాయా..? అంటే నిజంగా వస్తాయి. ఇలా వచ్చిన ఓ కేసు విషయంలో అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు దిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పడానికి సాధ్య‌ప‌డ‌ని చెప్పింది.

ధనేష్ లెస్దాన్ అనే న్యాయవాది ఈ పిటీషన్ దాఖలు చేశారు. దానిని జ‌స్టిస్ మ‌ద‌న్ బి లోకూర్‌, జ‌స్టిస్‌ దీప‌క్ గుప్త ధ‌ర్మాస‌నం విచారించింది. దోమ‌ల‌ను స‌మూలంగా అంతం చేయాల‌నేది ఆ పిటిష‌న్ సారాంశం. డెంగ్యూ, చికున్ గున్యా, జికా వంటి వ్యాధులు వ్యాపింప‌జేసి ఎంతో మంది మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న దోమ‌ల‌ను పూర్తిగా నాశనం చేసేలా చ‌ర్య‌లు తీసుకోమ‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీచేయాల‌ని కోరుతూ ధ‌నేష్ లెశ్ధాన్ అనే వ్య‌క్తి పిటిష‌న్ వేశాడు.

అయితే అలా చేయ‌డం త‌మ ప‌రిధిలోకి రాద‌ని, ఈ ప‌ని కేవ‌లం దేవుడు మాత్ర‌మే చేయ‌గ‌ల‌డ‌ని ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది. తాము దేవుళ్లం కాద‌ని, ఇలాంటి ప‌నులు చేయాల‌ని మ‌రోసారి అడ‌గొద్ద‌ని సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఇదే న్యాయవాది గత రెండేళ్ల క్రితం అంటే 2015లో కూడా దోమల వల్ల వ్యాపించే డెంగ్యూ సహా పలు రోగాలను నిరోధించాలని కోరుతూ ఓ పిటీషన్ ను దాఖలు చేయగా, దానిని కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయితే న్యాయవాది మాత్రం దోమల నివారణ చర్యలను తీసుకోవాల్సిందగా కోర్టు ప్రభుత్వాలను అదేశించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  mosquitoes  god  petition  abolish  Dhanesh Ieshdhan  Justices Madan B Lokur  Deepak Gupta  

Other Articles