Senior journalist KJ Singh, mother murdered in Mohali మరో సీనియర్ జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి

Former indian express news editor kj singh mother murdered

kj singh, kj singh journalist, mohali journalist, kj singh dead, kj singh death, kj singh indian express, kj singh toi, kj singh mother, punjab police, mohali journalist murder, journalist killing, gauri lankesh, capt. amarender singh, sit, punjab

Jr NTR movie performed extraordinarily and managed to mint Rs 47.25 crore worldwide. This is second only to the massive success of Baahubali franchise.

మరో సీనియర్ జర్నలిస్ట్ కేజే సింగ్ దారుణ హత్య,

Posted: 09/23/2017 04:21 PM IST
Former indian express news editor kj singh mother murdered

దేశంలో జర్నలిస్టులకు భద్రత కరువైంది. మరీ ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు పాలన సాగిస్తున్న రాష్ట్రాల్లోనే ఈ దారుణాలు జరగడం చర్చనీయాంశంగా మారుతుంది. ప్రముఖ రచయితలు, జర్నటిస్టులను టార్గెట్ చేసుకుని జరుగతున్న ఈ హత్యలు కలం వీరుల ప్రపంచంలో్ ప్రకంపనటు సృష్టిస్తున్నాయి. కత్తి కన్నా కలం గోప్పదన్న సూక్తి తెలిసి కూడా జర్నలిస్టులపై హత్యలకు తెగబడుతూ.. వారికి స్వేఛ్చా ప్రపంచాన్ని దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి.

ఇటీవల బెంగళూరులో సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌  దారుణ హత్య సృష్టించిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే చండీగఢ్ లో మరో సీనియర్‌ జర్నలిస్టు  కేజె సింగ్‌ ను అతని తల్లిని దారుణంగా హత్య చేశారు. పంజాబ్‌ మొహాలీలోని నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. కొడుకు హత్యను అడ్డుకోబోయిన కేజే సింగ్ తల్లి గురుచరణ్‌ కౌర్‌ (92) కూడా ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదాన్ని రేపింది.

గుర్తు తెలియని వ్యక్తులు  హత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జంట హత్యలపై పలువురు దిగ్భ్రాంతి వ్యక‍్తం చేశారు. అటు  సీనియర్‌ పోలీసు అధికారులు  కేజె సింగ్‌ నివాసానికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. మొహాలీ సూపరింటెండెంట్‌  కుల్దీప్ చాహల్ అందించిన సమాచారం ప్రకారం.. తలుపు తట్టిన శబ్దం విని తెరిచిన సింగ్ కడుపులో తొలి కత్తిపోటు దించారని, ఆ తరువాత అతన్ని లోనికి నెట్టేసి గొంతును కూడా కోసారని తెలిపారు. మంచంపై పడివున్న అతని తల్లిని కూడా అగంతకులు హత్యచేశారని తెలిపారు.

కాగా ఈ జంట హత్యలను దొంగతనం నేపథ్యంలో జరిగిన హత్యలుగా చిత్రీకరించేందుకు కూడా ప్రయత్నం సాగుతుందని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య జరిగిన తరువాత కేజే సింగ్ ఫోర్డ్ ఐకాన్ కారును, ఆయన ఇంట్లోంచి ఎల్ఈఢీ టీవీని హంతకులు అపహరించారని కూడా చెప్పారు. కేజీ సింగ్ యశ్ పాల్ కౌర్ ఇవాల మధ్యహ్నం తన మామయ్యకు అమ్మలకు బోజనం తీసుకుని రాగా ఇంటి తలుపు గడియకు బయటి నుంచి పెట్టివుండటం.. రక్తం మరకలు అంటివుండటాన్ని చూసి పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి.

చండీగడ్ లో  జర్నలిస్టుగా కేజె సింగ్‌కు  మంచి పేరుంది.  ముఖ్యంగా  ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు న్యూస్‌ ఎడిటర్‌గా,  టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా,  ది ట్రిబ్యూన్‌ లాంటి పత్రికల్లో  ఉన్నత స్థానాల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఓ కెనడియన్ పత్రికకు సేవలు అందిస్తున్నారు. కేజే సింగ్ హత్య నేపథ్యంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర డీజీపీతో ఫోన్ ద్వారా మాట్లాడిన ఆయన ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KJ Singh  Journalist murdered  Mohali  Mohali murder  capt. amarender singh  sit  punjab  

Other Articles