Win 1 crore for identifying benami properties పారాహుషార్.. బినామిల గుట్టుచెబితే నజరానా

Centre may give rewards up to rs 1 cr to benami property secret informers

benami property, central board of direct taxes, information, indian citizens, cash rewards, central government, PM Modi, Arun Jaitley, demonetisation

The Centre is planning to give out cash rewards to the tune of Rs one crore to secret informers who provide tip-offs to investigative agencies in connection with Benami Properties.

పారాహుషార్.. బినామిల గుట్టుచెబితే నజరానా

Posted: 09/23/2017 09:59 AM IST
Centre may give rewards up to rs 1 cr to benami property secret informers

పాత పెద్ద నోట్ల రద్దుతో సంచలన, సాహసోపేత నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. వాటి స్థానంలో కొత్తగా రూ.500తో పాటు పాత పెద్దనోటు కన్న పెద్దదైన రూ.2000 నోటును అత్యంత చాకచక్యంగా ఎలాంటి విమర్శలకు తావులేకుండా చెలమణిలోకి తీసుకువచ్చింది. అయితే గతేడాది నవంబర్ 8న నోట్ల రద్దు విషయమై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ.. నోట్ల రద్దుతో అవినీతి నిర్మూలణ, నకిలీ నోట్ల నియంత్రణ, ఉగ్రవాదం, అంతర్గత తీవ్రవాదం సమస్యలను ఇది చెక్ పెడుతుందని కూడా చెప్పింది.

అయితే కేంద్ర నిర్ధేశించుకున్న లక్యాలలో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. నోట్ల రద్దు చేసిన వారం రోజుల వ్యవధిలో భారత సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది వద్ద కొత్త రెండు వేల రూపాయల నోటు లభ్యం కావడమే కేంద్రం నోట్ల రద్దు ప్రక్రియను ప్రశ్నిస్తుంది. దీంతో ఉన్నపళ్లంగా ధోరణి మార్చిన కేంద్రం డిజిటల్ లావాదేవీల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ తతంగం అంతా ముగిసిన తరువాత అర్బీఐ తాజగా ప్రకటించి వార్షిక నివేదికలో నోట్ల రద్దు ప్రక్రియతో అర్బీఐ చేతులు కాల్చుకుందన్ని విషయం స్పష్టమైందని తేలింది.

దీంతో ఈ అపవాదు నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. గత ఎన్నికల ముందు విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చి ప్రతీ పేదవాడి బ్యాంకు అకౌంట్ లో రూ. 15 లక్షలను వేస్తామని హామీని ఇచ్చిన బీజేపి అ హామిని కూడా నిలబెట్టుకోలేదు. అ తరువాత పేదల బ్యాంకు అకౌంట్లలో పెద్దలు వచ్చి డబ్బులు వేస్తారని కూడా నోట్ట రద్దు నేపథ్యంలో ప్రచారం చేశారు. అది కూడా కనీసం జరగలేదు. దీంతో కేంద్రప్రభుత్వం చెబుదున్నవి వట్టి మాటలేనని ప్రజలకు అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలో ప్రజలకు ఏదైనా చేసి వారిలో కొ్ది శాతం మంది లాభపడినా.. దానిని చూపించి మిగతా వ్రజల ఓట్లను కొల్లగొట్టవచ్చునని భావిస్తున్న కేంద్రంలోని అధికార బీజేపి.. పాత పథకానికే విసృత ప్రచారం చేసి.. ప్రజలకు లభ్ది చేయాలని భావిస్తుంది. గతంతో నల్లధనం వున్నవారి వివరాలు చెప్పినా.. బినామి అస్తులున్న వారి సమాచారం అందించినా కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం అందుకు పరితోషకాన్ని అందించేది. అయితే దానికి అంతగా ప్రచారం లేకపోవడంతో కొందరు మాత్రమే దానిని వినియోగించుకున్నారు.

అయితే అదే పథకానికి విసృత ప్రచారాన్ని కల్పించి బినామీల గుట్టు విప్పేంచేందుకు వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తుంది. దీంతో ఓ వైపు బినామీల గుట్టు రట్టువ్వడంతో పాటు వారి అట కట్టించేందుకు కూడా దోహదపడుతుందని కేంద్రం యోచన, దీంతో ఇటు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగానికి అదాయంతో పాటు అటు సమాచారం అందించిన వారికి పారితోషకం కూడా ఇచ్చినట్టు అవుతుందని దీంతో ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్న చందాన్ని కూడా రానున్న ఎన్నకలలో ప్రచారాస్త్రంగా వినియోగించుకోవచ్చునని భావిస్తుంది.

దీంతో బినామీ ఆస్తుల గుట్టు విప్పేవారికి భారీ నజరానా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. బినామీ ఆస్తుల వివరాలు అందించిన వారి సమాచారం విలువను బట్టి కనిష్టంగా 15 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు నజరానాగా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. ప్రస్తుతం ఉన్న విధానంతో బినామీల ఆటకట్టడం కష్టంగా ఉందని, అదే ఇన్ఫార్మర్ విధానాన్ని తీసుకొచ్చి, రక్షణ కల్పిస్తే బినామీల గురించి ప్రజలే చూసుకుంటారని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పధకాన్ని అమలులోకి తీసుకురానుందని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్ (సీబీడీటీ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles