Bollywood producer surrendered in rape case పోలీసుల ఎదుట లొంగిపోయిన బాలీవుడ్ నిర్మాత

Sc denies bail to bollywood producer karim morani in rape case

Supreme Court, producer, Karim Morani, Dipak Misra, D.y.Chandrachud, Bollywood, Andhra Pradesh High Court, A.M.Khanwilkar, 2G Spectrum scam

Rape accused Karim Morani has been surrendered before telanagana police as he has been denied anticipatory bail by the Supreme Court.

పోలీసుల ఎదుట లొంగిపోయిన బాలీవుడ్ నిర్మాత

Posted: 09/23/2017 08:57 AM IST
Sc denies bail to bollywood producer karim morani in rape case

రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీకి అత్యాచారం కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో ఆయన మరోమార్గం లేక తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కరీం మొరానీని తాను లొంగిపోతున్నానని చెప్పడంతో అక్కడి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బాలీవుడ్ నిర్మాతపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అయనను అరెస్టు చేశారు.

'రా.వన్', 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్', 'దిల్ వాలే' వంటి ప్రేక్షకామోదం పొందిన హిందీ చిత్రాలను నిర్మించిన బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ హయత్ నగర్ పోలిస్ స్టేషన్ లో లొంగిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..? తన చిత్రాలలో అవకాశం కోసం వచ్చిన ఓ బీబీఎం విద్యార్ధిని 2015లో ట్రాప్ చేశాడు. అదే ఏడాది జూలైలో ఆమెకు మత్తుమందిచ్చి రేప్ చేశాడు. ఆ సందర్భంగా తీసిన అభ్యంతరకర ఫోటోలను అడ్డం పెట్టుకుని ఆరు నెలలపాటు ముంబై, హైదరాబాదుల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

 అంతే కాకుండా కరీం మొరానీకి అండర్ వరల్డ్ మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమెను చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టు తెలిపింది. దీంతో అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా, బెయిల్ పై బయటకు వచ్చి, ఆమెపై బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు నిందితుడి బెయిల్ ను రద్దు చేసింది, వెంటనే అతను కోర్టులో లొంగిపోవాలని సూచించింది. దీంతో ఆయన హైదరాబాదులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  producer  Karim Morani  Dipak Misra  D.y.Chandrachud  Bollywood  

Other Articles