anchor Lawrence O’Donnell screaming meltdown on set యాంకర్ తిక్కరేగి తిట్ట దండకం అందుకుని..

Veteran news anchor lawrence o donnell screaming meltdown on set

Lawrence O’Donnell screaming meltdown, Lawrence O’Donnell angry, Lawrence O’Donnell caught on cam, Lawrence O’Donnell, Veteran news anchor, MSNBC, Donald Trump, America, Americas, TV News, TV anchors, World, News

The MSNBC host lost his cool during breaks, slamming his fists on a desk and repeating profanities. He was upset that someone kept talking in his earpiece about something unrelated to the show he was taping.

ITEMVIDEOS: యాంకర్ తిక్కరేగి తిట్ల దండకం అందుకుని..

Posted: 09/22/2017 03:51 PM IST
Veteran news anchor lawrence o donnell screaming meltdown on set

బుల్లితెరపై నవ్వుతూ కనిపిస్తారు, తాము చదవుతున్న వార్తలకు సంబంధించిన హావభావాలను వ్యక్తం చేస్తూ.. ఔరా వీరెంతంటి దయార్థ హృదయులు అనిపించేలా వుంటారు..? నిజంగా వీరు సాధారణ జీవితంలోనూ ఇలాగే శాంతంగా, సౌమ్యంగా వుంటారా..? అన్న ప్రశ్న మీలో కలుగుతుందా... కెమెరా ముసుగు తీసేసి బాహ్య ప్రపంచంలోకి వీరు వస్తే ఎలా వుంటుంది..? కోపం వచ్చినా వీరు నవ్వుతూనే తమ అగ్రహాన్ని వ్యక్తం చేస్తారా..? అని అంటే అవన్నీ కెమెరా ముందే. వెనుక కాదు. అంటున్నాడు ఈ ప్రముఖ యాంకర్.

ఎంఎస్ ఎన్బీసీ చానల్ ప్రసారం చేసే 'లాస్ట్ వర్డ్' యాంకర్ లారెన్స్ ఒ డానెల్ సహనాన్ని కోల్పోయి అసభ్యపదజాలంతో దుర్భాషలాడుతున్న వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎందుకంటే కెమెరా ముందు చాలా సౌమ్యంగా కనిపించే మనవాడు కాస్తా.. రుద్రరూపం దాల్చడమే ఇందుకు కారణం. అయితే అందుకు కూడా కారణం లేకపోలేదు. తాను న్యూస్ చదువుతండగా అతని చెవిలో వున్న ఇయర్ ఫోన్ లో ఏవో గుసగుసలు వినబడుతున్నాయి. ఇవి తనను చాలా ఇబ్బందిపెట్టాయి. ఈ ఇయర్ పోన్ లో కంట్రోల్ రూమ్ నుంచి లేదా న్యూస్ డెస్క్ నుంచి ఏదైన ముఖ్యమైన వార్తలు, లేదా ఏవైనా సూచనలు చేస్తుంటారు.

అలాంటి ఇయర్ ఫోన్ లో తధేకంగా గుసగుసలు వినిపించడం, ఓ మహిళ తన షో ముగిసన తరువాత ఎక్కడకి వెళ్తారు అని ప్రశ్నించడం లాంటిని వినిపించాయి. దీంతో కొంత సేపటి వరకు సహనంగా చెప్పిన యాంకర్ లారెన్స్.. తన సహనం కోల్పోవడంతో సీటులోంచి లేచి మరీ అసభ్యపదజాలంతో దూషణపర్వాన్ని అందుకున్నాడు. అయినా మధ్యమధ్యలో అవే సనుగుడు వినిపించేసరికి రాయడానికి వీలు లేనంతగా తిట్ల దండకానికి దిగాడు. కంట్రోల్ రూమ్ లో ఏదో కంట్రోల్ తప్పిందని వ్యాఖ్యానించాడు. కెమెరా సిబ్బందిపై నిప్పులు చెరిగాడు. సుత్తి కొట్టడం ఆపాలని కేకలు పెట్టాడు. తాను వార్తలు చదవలేకపోతున్నానని అరిచాడు.

తన కోపం తగ్గేదాకా కమర్షియల్ బ్రేక్ కొనసాగించాలని అరిచాడు. ఎవరో అమ్మాయి ఈ షో తరువాత ఏం చేద్దామని కబుర్లు చెబుతోందని, ఆమె కావాలంటే ఇప్పుడే ఆ పని చేసుకోవచ్చని అన్నాడు. సుమారు 8 నిమిషాల పాటు కొనసాగిన ఈ వీడియోను మీడియా వాచ్ వెబ్ సైట్ 'మీడియేట్' వెలుగులోకి తీసుకువచ్చింది. ఇది వైరల్ కావడంతో లారెన్స్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా క్షమాపణలు కోరాడు. సాంకేతిక సమస్యలు తనను వేధించినందున అలా ప్రవర్తించానని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపాడు. రెచ్చిపోయి కేకలేస్తున్న లారెన్స్ వీడియోను మీరూ చూడవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Veteran news anchor  Lawrence O’Donnell  MSNBC  Trump  Americas  TV News  TV anchors  

Other Articles