MP Vasanthi Murugesan shocks Dinakaran, EPS camp దినకరన్ కు షాక్.. ఎగిరిపోయిన ఎంపీ..

Setback for dhinakaran aiadmk mp vasanthi murugesan joins eps camp

Tamil Nadu, TTV Dhinakaran, Vasanthi Murugesan, AIADMK, Edapaddi Palaniswamy, O Paaneerselvam , Setback for Dhinakaran, AIADMK MP Vasanthi Murugesan joins EPS camp,news, India news,Politics News,Politics

In a setback to T T V Dhinakarn, Lok Sabha AIADMK MP Vasanthi Murugesan decided to join Chief Minister Edapaddi Palaniswamy and O Paaneerselvam camp.

దినకరన్ కు షాక్.. ఎగిరిపోయిన ఎంపీ..

Posted: 09/22/2017 01:51 PM IST
Setback for dhinakaran aiadmk mp vasanthi murugesan joins eps camp

తమిళనాడు రాజకీయ పార్టీలన్నీ న్యాయస్తానం తీర్పు కోసం వేచిచూస్తున్నాయి. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయరాదని, ఆయా స్థానాలకు ఎన్నికలు ప్రకటించరాదని, ఇక బలనిరూపణపై తాము గతంలో ఇచ్చిన స్టే అమల్లో కొనసాగుతుందని చెప్పడంతో అన్ని పార్టీలు ఇప్పడు అసక్తికరంగా మద్రాసు హైకోర్టు వైపు దృష్టి సారించాయి. న్యాయస్థానం వెలువరించే తీర్పుపైనే తమిళనాడు ప్రభుత్వ మనుగడ కూడా అధారపడి వుంది.

ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రజలతో పాటు తమ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీలు కూడా తెరపైకి వస్తున్నాయని సంకేతాలు అందుతున్న క్రమంలో వాటితో పాటు అందరి చూపు ఇప్పడు హైకోర్టు వైపు వున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను అదునుగా చేసుకుని జాతీయ పార్టీయైన బీజేపి కూడా తమ సత్తాను చాటి దక్షిణాదిలో కూడా తాము పట్టుసాధించామని నిరూపించుకోవాలని బావిస్తుంది.

ఇప్పటికే దినకరణ్ వర్గానికి చెందిన ఓ తిరుగుబాటు ఎమ్మెల్యేపై ఇప్పటికీ అదాయపన్ను శాఖలు దాడులు చేశాయన్న వార్తలు నేపథ్యంలో ఆ వర్గంలో కలవరం ప్రారంభమైంది. అయితే ఎమ్మెల్యేలను తన గుప్పిట్లో పెట్టుకున్న దినకరణ్ తన ఎంపీలను మాత్రం వదిలేసినట్లు వున్నారు. అంచేతే దినకరన్ వర్గానికి చెందిన ఎంపీ, వసంత మురుగేశన్ ఆయనకు షాకిస్తూ ఏకంగా పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గంలో చేరిపోయారు. ఇవాళ ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంటికి వెళ్లిన ఆమె తన మద్ధతు సీఎం పళనిసామికేనని ప్రకటించారు.

దినకరన్‌ డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మీడియాతో ఆమె తెలిపారు. కాగా దినకరన్ కు అత్యంత విశ్వాసపాత్రురాలిగా కొనసాగుతూ వచ్చిన ఎంపీ వసంత మురుగేశన్ ఒక్కసారిగా కప్పదాటు వేసి ఇటు నుంచి అటు ఎగిరిపోవడంతో.. దినకరణ్ వర్గం నుంచి మరిన్ని వలసలు వస్తాయా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతుండగా, ఇటు పళనిసామి-పన్నీరు వర్గంలో మాత్రం అనందం వెల్లివిరుస్తుంది. మరికొంత మంది నేతలు కూడా క్యూ కట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles