pass women's reservation bill in loksabha, sonia to modi రాజీవ్ గాంధీని కీర్తిస్తూ.. ప్రధాని మోడీకి లేఖ..

Sonia gandhi writes to pm narendra modi on women s reservation bill

Women's Reservation Bill, Sonia Gandhi, Rajya Sabha, Narendra Modi, Lok Sabha, BJP, Rajeev Gandhi, Rahul Gandhi, Congress, politics

Congress president Sonia Gandhi wrote to PM Modi, urging him to ensure the expeditious passage of the Women's Reservation Bill in the Lok Sabha.

రాజీవ్ గాంధీని కీర్తిస్తూ.. ప్రధాని మోడీకి లేఖ..

Posted: 09/21/2017 07:23 PM IST
Sonia gandhi writes to pm narendra modi on women s reservation bill

దేశ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని స్మరిస్తూ.. చట్టసభలకే కాకుండా నగరపాలక సంస్థల నుంచి పంచాయితీ వరకు మహిళా రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రయత్నం చేసిన తొలి నేతగా కీర్తిస్తూ.. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. రాజ్యసభలో ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలోనూ ఆమోదం పొందేలా చూడాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.

ఈ విషయంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుందని స్పష్టంచేశారు. 2010 మార్చిలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే అప్పటి నుంచి కొన్ని కారణాల వల్ల లోక్ సభలో ఇంకా ఆమోదం పొందలేదు. ఇదే విషయాన్ని సోనియా ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు.

అయితే ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఈ బిల్లును వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ తరహాలో మీరు కూడా మహిళా సంక్షేమానికి, ప్రగతికి, అర్థిక పరిపుష్టికి పూనుకోవాలని.. అందులో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమమోదింపజేయేనని ఈ సందర్భంగా ఆమె లేఖలో గుర్తుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles