search on on gurmeet angel honey preet గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్ దొరికింది.. కానీ..!

After arrest rumor search operation launched to nab honeypreet insan

honey preet, Ram Rahim, honeypreet insan, search operation, gurmeet ram rahim, adopted daughter, self styled godsman, Nepal, Bihar

A massive search operation is underway along the Indo-Nepal border to nab Gurmeet Ram Rahim's adopted daughter, Honeypreet Insan. A high alert too has been issued.

గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్ దొరికింది.. కానీ..!

Posted: 09/21/2017 11:43 AM IST
After arrest rumor search operation launched to nab honeypreet insan

తన భక్తులపై లెక్కలేనన్ని అఘాయిత్యాలకు పాల్పడి.. తన సచ్ఛా సౌదా డేరాలో రహస్య మార్గాలను ఏర్పాటు చేసుకుని.. తనకు సేవ చేసేందుకు వచ్చిన సాధ్వీలపై అత్యాచారాలకు పాల్పడి, ఎదురుతిరిగిన వారిని అంతంచేసి వారిని అక్కడే తన డేరాలో పాతిపెట్టిన.. తన భక్తురాళ్లతో వ్యభిచార కార్యకాలపాలు కూడా నిర్వహింపజేసిన ఫుణ్యం ముసుగు కప్పుకున్న పాపాత్ముడు.. దైవత్వం రంగు పులుకున్న రాక్షసుడు గుర్మిత్ రామ్ రహీం సింగ్ బాబా అలియాస్ డేరా బాబా లైంగిక దాడి కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, గుర్మిత్ ప్రదాన అనుచరి, దత్తపుత్రికగా ప్రకటించుకున్న హనీ ప్రీత్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గుర్మిత్ రాంరహీం చేసిన అనేక నేరాల్లో అమె పాత్రకూడా వుండదని తేల్చిన పోలీసులు అమెను అరెస్టు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుర్మిత్ సింగ్ కు శిక్ష ఖారారు చేయనున్న సందర్భంగా రేగిన ఘర్షణలల్లో కూడా హనీప్రీత్ ప్రమేయముందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అమెను అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టాలని పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో అమె నెపాల్ లో తలదాచుకుందని, లేదా నెపాల్ నుంచి విదేశాలకు పారిపోయి వుండవచ్చునని వార్తలు వస్తున్న క్రమంలో నేపాల్ పోలీసులు కూడా అమెను అదుపులోకి తీసుకోవాలని అప్రమత్తమయ్యారు. తాజాగా హనీప్రీత్ పోలికలు కలిగిన ఒక యువతిని అదుపులోకి తీసుకుని అక్కడి పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్న తరువాత విచారించి.. ఆ వెనువెంటనే వదిలిపెట్టారు. దీంతో హనీప్రీత్ దొరికిందన్న వార్త దవానంలా పాకిపోయింది. కానీ అసలు విషయం తెలిసి మీడియా ప్రముఖులు నిట్టూరుస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నేపాల్‌లోని ధరానా వార్డు 13 లోగల ‘సెవారో సెకువా కార్నర్’లో ఇండియన్ నెంబర్ కలిగిన లగ్జరీ వాహనంలో హనీప్రీత్ పోలికలు కలిగిన ఒక యువతి పోలీసుల కంటపడింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో హనీప్రీత్ ఆచూకీ లభ్యమైందనే వార్త దావానలంలాపాకిపోయింది. అయితే పోలీసుల విచారణలో ఆమె హనీప్రీత్ కాదని తేలింది. కాగా పోలీసులు ఆమె వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే ఆమె బీహార్‌లోని పాట్నాకు చెందిన యువతి అని, ఫ్యామిలీతో నేపాల్ ను దర్శించేందుకు వచ్చిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles