Navaratri festival begins at indrakeeladri దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. కిటకిటలాడుతున్న అలయాలు..

Navaratri festival begins at kanaka durga temple today

Kanaka Durga temple, Swarnakavachalaankruta Durga Devi, Indrakeeladri hills, Dasara festival celebrations, devotees, dussera, festive season, vijayawada, latest news

The famed Kanaka Durga temple atop Indrakeeladri hills at vijayawada is geared up to host nine days Dasara festival celebrations from Today

నేటి నుంచే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. కిటకిటలాడుతున్న అలయాలు..

Posted: 09/21/2017 10:54 AM IST
Navaratri festival begins at kanaka durga temple today

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇవాళ అమ్మవారి దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచే పలు కాలనీల్లో అమ్మవారిని విగ్రహాన్ని స్థాపించి, అవాహనం చేసి.. ప్రత్యేక పూజలతో నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఇక అనేక అలాయాల్లో కూడా ఇవాళ వేకువ జామునుంచే అమ్మవారి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల ప్రారంభం కావడంతో ఇవాళ అమ్మవారిని దర్శించుకనేందుకు భక్తులు ఉదయమే అలయాలకు వెళ్లి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.

ఇక దేశవ్యాప్తంగా అన్ని అమ్మవారి శక్తిఫీఠాల్లోనూ దేవీశరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు భక్తులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఫుణ్యక్షేత్రాలలో అమ్మవారి శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నాయి అలయకమిటీలు. ఇప్పటికే విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై వెలసినీ కనకదుర్గమ్మ ఆలయానికి తండోపతండాలుగా విచ్చేసిన భక్తులు అమ్మావారి దర్శనం కోసం బారులు తీరారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు దసరా ఉత్సవాలు సాగనున్నాయి.

ఇవాళ శరన్నవరాత్రులు తొలిరోజు కావడం చేత కనకదుర్గమ్మ తల్లి భక్తులకు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు అభయప్రధానం చేయనున్నారు. పూర్తి స్వర్ణాభరణాల కాంతుల మధ్య దుర్గమ్మ ధగధగలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. కుడి చేతిలో స్వర్ణంతో చేసిన త్రిశూలాన్ని పట్టుకున్న అమ్మవారు.. భక్తులకు కొండంత అండగా నిలుస్తానన్నట్లు మూర్తీభవించి వుంటుంది. అమ్మవారి నవరాత్రి వేడుకల ప్రారంభాన్ని దర్శించుకుంటే శుభం కలుగుతుందని విశ్వసించే భక్తులు.. వేకువ జామునే అలయాన్ని చేరుకున్నారు.

తొలిరోజున అమ్మవారి దర్శనానికి భక్తులను ఉదయం 9 గంటల నుంచి అనుమతిస్తామని, ఈ-సేవ, ఇంటర్నెట్ ద్వారా దర్శన స్లాట్లను పొందిన వారికి త్వరగా దర్శనం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలుగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. కృష్ణా ఘాట్ నుంచి భక్తులను పైకి అనుమతిస్తామని, వేరే మార్గంలో కిందకు వెళ్లాల్సి వుంటుందని స్పష్టం చేశారు. కొండపై వన్ వే అమల్లో వుందని, ఎటువంటి వాహనాలనూ అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles