Platform ticket rate hiked in Secunderabad station పండుగ సీజన్లో జేబులు గుల్ల

Temporary increase in platform ticket rate at secunderabad station

South Central Railway, nampally railway station, kachiguda railway station, platform ticket charges, platform ticket, dussera, dussera festive season, Telangana, Hyderabad, latest news, Secunderabad Railway Station, latest news

The South Central Railway doubled the Platform Ticket Rate from Rs. 10 to Rs. 20 on temporary basis. In view of the ensuing Dussera festival season, it is anticipated that there will be huge crowd at Railway Station.

పండుగ సీజన్లో పాకెట్ గుల్ల చేస్తున్న ఎస్సీఆర్

Posted: 09/21/2017 10:12 AM IST
Temporary increase in platform ticket rate at secunderabad station

పండుగ సీజన్ వచ్చిదంటే చాలు వినియోగదారులను తమ దుకాణాలకు రప్పించుకునేందుకు అనేక రకాల అఫర్లను, డిస్కోంట్లను ప్రకటించేస్తుంటారు వాణిజ్యవేత్తలు. అయితే ఇదే పండగ సీజన్ అదనుగా పెట్టుకున్న కొన్ని ప్రభుత్వ శాఖలు మాత్రం ప్రయాణికుల జేబులను గుల్ల చేసేందుకు రెడీ అవుతుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ కొత్త తరహా విధానం అమలు అవుతుంది. పండగ సీజన్ లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని అర్టీసీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో రైల్వే శాఖ ప్రయాణ చార్జీలను పెంచేసి లాభాలను గడించేస్తుంటాయి.

అది చాలదన్నట్లు ప్రయాణికులతో పాటు ప్రయాణికులను రైళ్లలో ఎక్కించేందుకు వచ్చే వచ్చే బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి కూడా అదాయాన్ని రాబట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ సన్నధమైంది. ఈ మేరకు ఏకంగా ఫ్లాట్ ఫాం టిక్కెట్ చార్జీలను రెండింతలు చేసింది. నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ చార్జీలు అక్టోబర్ 3 వరకు అమల్లో వుండనున్నాయని సమాచారం. ప్రసత్తం వున్న ఫ్లాట్ ఫాం ధరలను ఏకంగా నూటికి నూరు శాతం పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రైల్వేశాఖ అధికారుల నిర్ణయం ఇటు ప్రయాణికులతో పాటు అటు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను అందోళనకు గురిచేస్తుంది. ఇంతవరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రవేశించాలంటే ఫ్లాట్ ఫాం టికెట్ 10 రూపాయలుగా ఉండేది. నేటి నుంచి ఈ టికెట్ ధర 20 రూపాయలు కానుంది. ఇప్పటికే ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే అధికారుల నుంచి ఉత్తర్వులు జారీ కావడంతో పెంచిన ధర అమలులోకి వచ్చింది. దీనిపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles